ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జీటీ బ్యాటింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. శుభ్‌మన్ గిల్ (38), జోస్ బట్లర్ (39) కూడా రాణించారు. చివర్లో షరీఫానే రూథర్‌ఫోర్డ్ 18 పరుగులు, రషీద్ ఖాన్ 6 పరుగులు చేశారు. గుజరాత్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కెప్టెన్ గిల్ 27 బంతుల్లో 38 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన జోస్ బట్లర్ 24 బంతుల్లో 39 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 63 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Read Also: China: ఇంత పిసినారి అయితే ఎలా.. కంపెనీ టాయిలెట్‌ని అద్దెకు తీసుకున్న మహిళ..
మధ్యలో షారుఖ్ ఖాన్ (9), రూథర్‌ఫోర్డ్ (18) లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరి ఓవర్లలో రషీద్ ఖాన్ (6), కగిసో రబాడా (7) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4 ఓవర్లలో 29 పరుగులు, 2 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రహ్మాన్, సత్యనారాయణ రాజు ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా.. ముంబై ఇండియన్స్ 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ లాంటి కీలక బౌలర్లు ఉన్నారు. ముంబై బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎలా ఆడతారనేది చూడాలి.
Read Also: Blinkit: సమ్మర్ స్పెషల్.. 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ!