IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.
Always Shubhu Baby: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య గ్రౌండ్‌లో ఉద్రికత్త స్పష్టంగా కనిపించింది. టాస్ దగ్గర నుంచే ఇద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్‌లో తేడా కనిపించడంతో పాటు శుభ్‌మన్ ఔట్ అయిన తర్వాత హార్దిక్ తన భావాలను ఆగ్రహంగా వ్యక్తపరిచిన తీరు అభిమానుల్లో అనుమానాలు కలిగించింది. అయితే, మ్యాచ్ అనంతరం గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “నథింగ్ బట్ లవ్”…
ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.. గుజరాత్‌పై గెలుపుతో క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్తే.. ఈ మ్యాచ్‌లో ఓటమి మూఠగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇంటిదారి పట్టింది..
డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ ఇచ్చిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. సుదర్శన్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ ఆడాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ వృధా అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 4…
DC vs GT: ఐపీఎల్-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసింది.
Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో గుజరాత్ టైటన్స్ (GT) మే 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న లక్నో సూపర్ జైంట్స్ (LSG)తో మ్యాచ్‌లో ప్రత్యేక లావెండర్ రంగు జెర్సీని ధరించనుంది. ఈ నిర్ణయాన్ని జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ చర్య క్యాన్సర్ వ్యతిరేక పోరాటాన్ని ప్రోత్సహించడానికి సంబంధించినట్లు వివరించింది. గతంలో కూడా గుజరాత్ టైటన్స్ ఇలాంటి సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా లావెండర్ జెర్సీతో అనేక సార్లు…
MI vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తడబడింది. గుజరాత్ టైటన్స్ బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ సరిగా లభించలేదు. ఓపెనర్ రికెల్టన్ (2) రెండో బంతికే వెనుదిరిగాడు. అలాగే మరో ఓపెనర్ రోహిత్ శర్మ…
MI vs GT: ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టాస్ గెలిచి ముంబైని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్ కి చేరుకుంటుంది. ఇద్దరి ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ జట్టు నాలుగో స్థానంలో…
తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్‌లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ డోపింగ్‌లో దొరికిపోయాడు. డ్రగ్స్ (నిషేధిత ఉత్ప్రేరకం) వాడినందుకు గానూ క్రికెట్ దక్షిణాఫ్రికా అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని రబాడ స్వయంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాడు. వినోదం కోసం తీసుకున్న డ్రగ్స్ కారణంగా తాను నిషేధాన్ని ఎదుర్కొంటున్నా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్‌లో ఉన్నానని, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడుతానని రబాడ చెప్పాడు. కగిసో రబాడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…