Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనుండగా పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా గురువారం తెలుగు టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Also read:Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్
Also Read
“డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి” అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఆయన భార్యగా, చిన్న కుమారుడితో కుటుంబ జీవితం చూపిస్తుండగా, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచడం కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. టీజర్ చివర్లో..“రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” — అని సముద్రఖని చెప్పే డైలాగ్
ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా నిలుస్తుంది.
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!