Cricket Fans Demanding To Bring Back Sanju Samson In Suryakumar Yadav Place: సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా చెలామణి అవుతున్న టీమిండియా ఆటగాడు. కానీ.. వన్డేల్లో మాత్రం ఇప్పటిదాకా తనదైన ముద్ర చూపించలేకపోయాడు. ఒకట్రెండు సార్లు మెరుపులు మెరిపించాడు కానీ, నిలకడగా రాణించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకూ రెండు వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రెండు సార్లు కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇలా ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు.. గత వన్డే సిరీస్‌లలోనూ సూర్య పెద్దగా సత్తా చాటలేదు. గత పది వన్డే మ్యాచ్‌ల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. 13, 9, 8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య.. 27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలే ఉన్నాయి.
IND vs AUS: భారత్‌పై ఆస్ట్రేలియా కొత్త రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు
ఇలా వన్డేల్లో సూర్య వరుసగా విఫలమవుతున్న తరుణంలో.. అతడ్ని జట్టులో నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అతని స్థానంలో.. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ని జట్టులోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వరుసగా ఫెయిల్ అవుతున్నా.. సూర్యకి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారని, సంజూకి మాత్రం ఇలాంటి ఛాన్సులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టన్నులకొద్దీ ట్యాలెంట్ ఉన్నప్పటికీ.. అతడ్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల్లాగే అతనికి కూడా అవకాశాలు ఇవ్వాలని, సంజూని జట్టులోకి తీసుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ #SanjuSamson హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా.. మోకాలి గాయం నుంచి కోలుకున్న శాంసన్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇతనికి టీ20ల్లో మంచి ట్రాక్ లేదు కానీ, వన్డేల్లో చెప్పుకోదగిన రికార్డ్ ఉంది. 8 ఇన్నింగ్స్‌లలో అతడు 272 పరుగులు చేశాడు. అందులో 86(నాటౌట్) టాప్ స్కోర్‌గా ఉంది.
Mrunal Thakur: అప్పుడే అంత రేటు పెంచేస్తే ఎలా బ్యూటీ..?