Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను సైతం అందుకుంటుంది. ప్రస్తుతం నాని సరసన ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఇంకోపక్క బాలీవుడ్ లో సైతం స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. రెండో సినిమా నుంచే అమ్మడు డిమాండ్ చేయడం మొదలుపెట్టిందట. ఒక్కసారిగా పారితోషికాన్ని డబుల్ చేసి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నానితో కలిసి నటిస్తున్న చిత్రానికి అమ్మడు ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యూనిరేషన్ అందుకుందని టాక్ నడుస్తోంది. హిట్ హీరోయిన్ కావడంతో చేసేది కూడా ఏం లేక నిర్మాతలు సైతం ఓకే అన్నట్లు వినికిడి.
మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..
కాగా, ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో మృణాల్ గురించే చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో భారీ హిట్ కొట్టి తరువాత ఇలాగే డిమాండ్ చేసి బొక్కాబోర్లా పడిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందులో ముందు ముందు ఈ బ్యూటీ కూడా జాయిన్ అయ్యేలా ఉందే అని అనుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం తెలివైన పద్దతే. కానీ, కథను నమ్మి, గుర్తుండిపోయే పాత్రలు చేస్తే.. డబ్బు దానంతట అదే వస్తుంది అని చెప్పుకొస్తున్నారు. రెండో సినిమాకే రూ. మూడు కోట్లు అంటే మాటలు కాదు. మృణాల్ లానే మొదటి సినిమాతో నే స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని వరుస సినిమాలు హిట్ల మీద హిట్లు అందుకుంటున్న శ్రీలీల కూడా అంత డిమాండ్ చేయలేదని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది చూడాలి.