Australia Creates Record On Indian Cricket Team: తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. అందుకు రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో.. ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌ని ఓడించింది. టీమిండియా కుదిర్చిన 118 పరుగుల లక్ష్యాన్ని.. 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా చేధించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో భారత్‌పై అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డ్ న్యూజీలాండ్ జట్టు పేరిట ఉండేది. 2019లో హామిల్టన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో.. భారత్‌పై 93 పరుగుల లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే చేధించింది. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో ఆ రికార్డ్‌ని ఆస్ట్రేలియా తిరగరాసింది.
Viral Dog : అబ్బా.. బుడ్డోడిని చూడగానే బలే ఊపేస్తుందే..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. కనీసం పోరాట పటిమ కూడా కనబర్చలేకపోయారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే.. ఇతర బ్యాటర్ల పరిస్థితి మరెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. 8 ఓవర్లలో 53 పరుగులిచ్చిన ఇతడు.. ఒక మెయిడిన్ ఓవర్ వేయడంతో పాటు ఐదు కీలక వికెట్లు తీశాడు. ఇక 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. 11 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66), ట్రావిస్ హెడ్ (51) బౌండరీల వర్షం కురిపించి.. మ్యాచ్‌ని త్వరగా ఫినిష్ చేశారు.
Sister Dead Body On Bike : సూసైడ్ చేసుకున్న చెల్లె.. మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లిన అన్న