విన్నావా ఆరుద్రా తమాషా సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా అన్నాడు శ్రీశ్రీ ఒక చోట. నిజంగానే సంప్రదాయాలు విశ్వాసాలు తరతరాలు కొనసాగుతుంటాయి. అయితే వాటి రూపం మారిపోతుంటుంది. అంతేగాక భిన్నమైన సంప్రదాయాలు సంసృతులు విశ్వాసంగా సువిశాల భారత దేశంలో ఈ క్రమంలో మరింత సాగుతుంటుంది. ఒక్కొక్క కుటుంబంలోనూ లేదా సమాజంలో వచ్చే ఈ మార్పు మొత్తం స్వరూపం అందరూ చేసుకునే పండుగలు పబ్బాలు సమయంలో మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే` తెలుగువారి తొలి పండుగ, తెలుగువారికే సొంతమైన పండుగ ఉగాదికి ఇది మరింత వర్తిస్తుంది. నిజానికి ఉగాదిని నూతన సంవత్సరాది గా చూడాలి తప్ప ప్రత్యేకంగా పండుగ కాదనే వారూ ఉంటారు. కరోనా నీడలో రెండవ ఉగాదిగా శార్వరికి వీడ్కోలు పలుకుతూ ప్లవనామ సంవత్సరాదిని ఆహ్వానిస్తున్న వేళ , కాలం తెచ్చిన మార్పుపై ఒక లుక్.
భారతీయులకు పండుగలకు కొదవ లేదు. కొన్ని దేశ వ్యాపితమైనవైతే కొన్ని ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఉత్తరాదిని ధూం ధాంగా జరిగే పండుగలు కొన్ని దక్షిణాదిన అంత జోరుగా ఉండకపోవచ్చు. హోలీ,దీపావళి వంటివి రెండు భాగాల్లో రెండు రకాలుగా మారుతుంటాయి. దక్షిణాదిన కూడా రాష్ట్రాలకే పరిమితమైనవి వున్నాయి.ఆ ప్రకారమైతే దక్షిణాదిన మూడు భాషా రాష్ట్రాల్లో జరిగేది ఉగాది. .కన్నడిగులు, మహారాష్ట్రలు దీన్ని యుగాది అంటారు. యుగం అంటే సంవత్సరం అని కాలానికి సంబంధించిన ఒక లెక్క.కొత్త ఏడాది మొదలవుతుంది కనుక యుగాది.ఇంతకూ మొదలయ్యే ఏడాది అచ్చంగా తెలుగేనా అంటే సంవత్సరా పేర్లన్నీ సంస్కృతంలో వుంటాయి. వాస్తవం చెప్పాలంటే ఈ సంప్రదాయ సంవత్సరాలను కూడా కేవలం భక్తి విశ్వాసాలు అమలుకోసం ఇంకా చెప్పాలంటే ముహూర్తాలు వగైరా చూసుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు. రైతాంగం మాత్రం తమ పంటను కొంత వరకు ప్రకృతి మార్పు తో పోల్చి చెప్పడం కద్దు.
ఏ పండుగ కన్నా ఎక్కువగా యుగాదిలోనే కాం తెచ్చిన మార్పు బాగా తెలుస్తాయి. జనవరి 1న హ్యాపీ న్యూ ఇయర్ అంటూ జరిగే హడావుడి ఉగాది రోజున వుంటుందా? ఎందుకుండదంటే ఇది దైనందిన జీవిత వ్యవహారాలో ఉపయోగించడం లేదు గనక. లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార పానా వ్యవహారాలు అన్ని ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారమే నడుస్తుంటాయి. ప్రపంచమంతటా అమలవుతున్న కాలం అదే. మనమూ దాన్ని బట్టి ఆలోచిస్తుంటాము. ప్రణాళికలు వేసుకుంటాము. మార్చి నుంచి జూన్ వరకూ పరీక్షు వగైరా వుంటాయి, మార్చి 31 కి వాణిజ్య సంవత్సరం పూర్తవుతుంది.. ఇలా..అనేకం ఉన్నాయి.ఇందులో ఏదీ తెలుగు ఏడాది లెక్క ప్రకారం జరగదు. పత్రికలు కూడా ఈ ప్రకారం వస్తాయి. కాకపోతే తెలుగు పంచాంగం లెక్కలు కూడా వేస్తుంటారు.
ఉగాది అంటేనే మామిడి చిగుళ్లు కోకిలల కూతలు వగైరా వగైరా మదిలో మెదులుతాయి. కవితలు పాటలన్నిటా అవే ప్రత్యక్షమవుతుంటాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాటి వారు అచ్చంగా చిగుళ్లు కోయిల చుట్టూనే అనేక పాటు కట్టారు. సంప్రదాయ కవులైతే ఉగాది వూహ రాగానే పద్యాలు గుమ్మరించి వదుతారు. అందులో అతి ప్రధానమైంది వసంత ఋతు వర్ణన. వసంతం అనగానే వలపుల తలుపులు గుప్పుమంటాయి. కానీ ఇప్పుడు మారిన పర్యావరణంలో జీవావరణంలో వసంతం అంతగా కనిపించడం లేదు, కనిపించినా పట్టించుకునేది లేదు. ఇప్పుడు రుతు పరిణామం గమనించేందుకు పట్టణాల్లోనూ చుట్టుపక్కల పల్లెల్లోనూ పిల్లలకు అవకాశమే లేదు, అంతస్తుపై అంతస్తుగా కొలువు తీరిన అపార్ట్‌మెంట్ సంసృతిలో మొక్కలు కనపించే అవకాశమే పరిమితం అలాటప్పుడు కొత్త చిగుళ్లను వూహల్లో తప్ప వాస్తవంలో చూడగలిగే అవకాశం కొద్ది మంది వృక్ష ప్రేమికులకే పరిమితమై పోయింది. కొత్త చిగురు అలా వుంచితే కొత్త కుండలో నీళ్లు .. నీటి బాటిళ్ల రోజుల్లో కుండలన్నవి కనుమరుగవుతున్న స్థితి.ఇప్పుడిప్పుడే పర్యావరణ చైతన్యం మొక్కల పెంపకం అవసరం గుర్తిస్తున్నారు.
వసంతం అనగానే యువతీ యువకుల సరాగాలు సరస సంరంభాలు పాత కావ్యాల్లో పరుచుకుని వుంటాయి. ఇప్పుడైతే ఆ వసంత శోభకు ఏ స్థానమూ వుండటం లేదు. వాలెంటైన్స్ డేలు ఆ స్థానాన్ని అవోకగా ఆక్రమించాయి. అసలు ప్రేమ అనే మాట మివ కోల్పోయి లవ్ అన్నదే దాని సార్వత్రిక భాషాతీత వ్యక్తీకరణగా ప్రపంచమంతటా స్థిరపడిరది.
ఉగాది సంకేతాల్లో మావి చిగురు తర్వాతి స్థానం కోయిలదే. ప్రకృతి సహజమైన పక్షుల కిలకిల రావాలు, కోయిు కుహూలు రవాలు మాత్రం ఇప్పుడు అరుదై పోతున్నాయి. అసలు పిట్టలు పిచ్చుకలు అదృశ్యమవుతున్నాయి. కోయి పాటకు పర్యాయపదం పోతనామాత్యుడు భాగవతంలో ‘మందార మకరంద మాధుర్యమున తేలు కోయిల చేరునే కుటజములకు’ అనే పద్యం కట్టాడు. కృష్న శాస్త్రి గారి పాటల్లోనైతే ఎప్పుడూ చిగుళ్లు కోయిలు, సెయేళ్లు వంటివి పకరిస్తూనే వుంటాయి. మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అని ప్రశ్నిస్తాడు. చిగురాకు వూయలో మరిచిన ఓ చిలుకా అనేది ఎప్పటిదో పాత పాట. చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పేసె చెయ్యయినా వెయ్యవేమీ ఓ బాబూ దొర అనే ఆలుమగలు పాట కూడా చిగురుతో ముడిపడిరదే. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు చిగురునూ వలపులనూ కలిపి పాటల్లడం మన సినీ కవులకు రివాజు. ఇప్పుడు రీమిక్సింగు తప్ప ఆ పాట ప్లవుూ గ్లంతైపోయాయి.
కాగాపోగా ఏదో విధంగా అలాగే కొనసాగుతుంది ఉగాది పచ్చడి వొక్కటే! షడ్రుచుల సమ్మేళనం అంటారు గాని చేదు కపడం వల్లనే దానికి ప్రత్యేకత. ఇది అటూ ఇటూ తిరిగి ఇప్పుడు చేదు లేకుండా ఉగాది పచ్చడి చేస్తామనే వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ రోజున ఇళ్లలోనూ కార్యాయాల్లోనూ మాత్రమే గా క హోటళ్లలోనూ మెస్సులోనూ కూడా ఉగాది పచ్చడి వేస్తున్నారు. కొత్త చింతపండు, పచ్చి మిరపకాయలు, కొత్త బెల్లం, మామిడిపిందొ,వేతపూత,ఉప్పు కలిపితే తయారయ్యేదే ఉగాది పచ్చడి..వీటిని మధుర,ఆమ్ల(పుపు)వణ,కటు(కారం),తిక్త,(చేదు),కషాయం అని సంసృతంలో చెబుతారు. ప్రకృతిలో కొత్తగా కాస్తున్న దినుసులు కలపడమే ఇక్కడ విశేషం. చేదు చేరిక ఆ కవులకు బోలెడెంత పని కల్పించింది. చేదు కూడా ఒక రుచే అని ఇచ్చాపురం జగన్నాథం నవల రాశారు. ఉగాది గురించిన ఆధునిక కవితన్ని ఎక్కువగా ఈ చేదు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి.ఎందుకంటే యుగాది తెలుగు సాహిత్య సాంస్కృతిక వేడుకకు ప్రసిద్ధి. కవి సమ్మేళనాలకు పెట్టింది పేరు. ఈ సమ్మేళనాల్లో కవి శేఖయిలు అరిగిపోయిన ప్రాచీన పద్దతుల్లో కోయిల గురించి చిగుళ్ల గురించి వినిపించి శాలువ కప్పించుకుని నిష్క్రమించేవారు. ఆకాశవాణి ఏటేటా యుగాదికి జరిపే కవి సమ్మేళనాలలో విశ్వనాథ,కృష్ణశాస్త్రి,శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, సినారె, ఇత్యాది పెద్ద కవులు నుంచి రేడియో వారి కటాక్షం నోచిన కుర్రకవు వరకూ గేయాలు వచనాలు వినిపించడం మొదలెట్టాక ఈ బాణీ మారింది.జీవితంలో చేదుగా మారిందనీ, కోయిలలు ఎక్కడ కనిపిస్తున్నాయని ప్రశ్నిస్తూ కవితలు రాస్తుంటారు.
ఇంగ్లీషు వారి కామానంలో సంవత్సరాకు సంఖ్యలు ఉంటాయి గాని భారతీయ సంప్రదాయంలో పేర్లు తిరుగుతుంటాయి. అరవై నాలుగు సంవత్సరాలకూ ప్రభవ,విభవలతో మొదలెట్టి వికృత, వ్యయ,రుణ, విక్రమ,రౌద్ర, రక్తాక్షి, ప్రమోదూత,ప్రమాది ప్రజోత్పత్తి తదితర నామధేయములు ఉంటాయి. ఇందులో కొన్ని మధురమైన పేర్లు కాగా మరికొన్ని భయానకంగా వుంటాయి. ప్రారంభాన్ని సూచించే ప్రభవతో మొదలై క్షయతో ముగుస్తుంది. 1910లోనే ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు ఉగాది సంచిక సంప్రదాయం మొదలెట్టారు. అంటే వంద ఏళ్ల కిందట.. వాటిపై వచ్చిన పరిశోధనా వ్యాసాలు తిరగేస్తే కాలగమనంలో మానవ ప్రస్థానం కళ్లకు కడుతుంది. ఉదాహరణకు 1919 యుగాది సంచికలో జలియన్ వాలాబాగ్ దురంతాపై నియమించిన హంటర్ కమీషన్ అభిశసంనను సుదీర్ఘంగా ప్రచురించారు.
భారత ప్రభుత్వం చెన్న రాష్ట్రము పట్ల చూపుచున్న వివక్షనే చెన్న రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రు పట్ల చూపుచున్నది అని నాటి పరిస్థితిని ప్రస్తావించింది.ఇది తొంభై ఏళ్ల నాటి మాట.1944 రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితిలో సంచిక తక్కువ పేజీతో వచ్చింది. తర్వాతి కాంలో సుప్రసిద్ధులైన తొగు కవు రచయిత తొలి అడుగు అక్షరాు కూడా ఈ సంచికల్లోనే చూడగము. నమ్మకాలుగా వారికి ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరి. మీడియా విస్తరణతో ఈ పంచాంగ పఠనం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. అధికారికంగా నిర్వహించే పఠనానికి ముఖ్యమంత్రి విచ్చేసి వింటారు. అక్కడ పఠనం ఏలినవారికి ఏ మాత్రం నొప్పి కలిగించకుండా మెప్పించే ఫక్కీలో నడుస్తుంది. అదే సమయంలో కొందరు ప్రతిపక్ష నేతలు తమ తమ ఆస్థానాల్లో ఈ తతంగం ఏర్పాటు చేసుకుంటారు. ఏ గూటి చిక ఆ పాట పాడినట్లు ఏ పార్టీ కేంద్రంలో పంచాంగం వారికి అనుకూలంగా వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషణలు మారి .అసమ్మతి, ప్రతిపక్షం, ఎన్నికలు వంటివి అలవోకగా చెప్పేస్తుంటారు పంచాంగ కర్తలు. ఆహ్వానించిన వారిని అలరించడమే ఏకైక సూత్రమనేది అన్నిటినీ మించిన సంప్రదాయం! పంచాంగం అంటే ఏమిటి?పంచ అంగాలు` లేదా అయిదు భాగాలు…..తిథి,వారం,నక్షత్రం,యోగం,కరణం అన్నవే అయిదు అంగాలంటారు. ఇందులో వారం నక్షత్రం ఖగోళ సంబంధమైనవైతే మిగిలినవన్నీ నమ్మకాలతో ముడిపడినవే. ఫలానా సమయంలో ఫలానా తిథి గనక ఆ సమయంలో ఫలానా పని చేస్తే కలిగే యోగం ఇలా ఉంటుందని చెప్పడమన్న మాట. ఏ పని చేయాలన్నా ముందు ముహూర్తం చూసుకుని మొదలెట్టే అలవాటు ఇప్పటికీ అత్యధికులు కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ కూడా జీవిత వాస్తవానికి తరతరాల విశ్వాసాలకు వైరుధ్యం ఎదురవుతూనే ఉంటుంది. ఉదాహరణకు పరీక్షలు, ఇంటర్వ్యూులు, ఎన్నికలు ఇవేవీ ఎవరో ఒకరు అనుకున్న ప్రకారం మొదు కావు.అలాగే ఉభయ పక్షాలు ముహూర్తం చూసుకుని బయిుదేరినా ఎన్నికల్లో ఒకరినే విజయం వరిస్తుంది. అయినా సరే తమ వరకు తాము ఏవో ముహూర్తాలు అనుసరించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
వాస్తవానికి ఉగాది సందర్భంలో వందలాది మంది విడుదల చేసే పంచాంగాలో ఎన్నో తేడాలు ఉంటాయి. తిరుపతి,భద్రాచలం వంటి చోట పండుగలు, గ్రహణానికి సంబంధించిన అనుసరించే కాలం గణనలో తేడాలు కనిపిస్తుంటాయి. అయితే భారతీయ ఖగోళ శాస్త్రం చాలా గొప్పది కనుక గ్రహ గతులు గురించిన లెక్కలు చాలా వరకూ సరిగ్గా నడుస్తుంటాయి. శాస్త్ర బద్దమైన ఆ అవగాహనకు తమ నమ్మకాలను జోడిస్తారు పంచాంగ కర్తలు. ఇవన్నీ ఉన్నా నిర్ణయం తీసుకోవడం మాత్రం జనవరి, ఫిబ్రవరి లెక్కలోనే జరుగుతుంది. కాకపోతే వాటికి సరిగా వచ్చే శ్రావణ మాసం, ఫాల్గుణ మాసం వంటివి కొన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పల్లెల్లో రైతాంగం కార్తెను అనుసరిస్తున్నా వారి లావాదేవీలు మాత్రం మామూలు క్యాలెండరే అనుసరిస్తారు.
క్యాలెండర్ వినియోగంలో ఈ మార్పు ఎక్కడి వరకూ వచ్చిందంటే ఒకప్పుడు యుగాది ఎక్కువగా మార్చి నెలలో వచ్చేది. పర్యావరణంలో వచ్చిన మార్పు,సూర్య గమనంలో తేడాతో ఇప్పుడు అది ఏప్రిల్‌కు మారిపోయింది. ఎవరైనా ఉగాది ఎప్పుడంటే ఏప్రిల్ 13వ తేదీన అని చెబుతారు గాని చైత్ర శుద్ధ పాడ్యమి అనరు! సెలవులు గట్రా ఆ విధంగా తీసుకుంటారు. ఇవన్నీ విశ్వాసం వాస్తవాలతో సర్దుబాటు చేసుకుని మనుగడ సాగిస్తున్న తీరుకు ఉదాహరణలే. బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం ప్రతిచోటా తన క్యాలెండర్‌నే వాడుకలోకి తెచ్చింది. చంద్రమాన సంవత్సరాలో నెలకు నాలుగు వారాలు చొప్పున లెక్కించి దాన్ని సరిచేయడానికి అధిక మాసం,శూన్యమాసం లెక్కిస్తుంటారు. ఇందుకు భిన్నంగా ఇంగ్లీషు క్యాలెండర్‌లో నెను బట్టి 30,31 రోజు ఖాయం చేసి ఫిబ్రవరిలో మాత్రం 27,లీపు సంవత్సరంలో మాత్రం 28 రోజు చూపిస్తుంటారు. చాంద్రమానం ఆధారంగా కాలాన్ని గణించిన భారతీయ సంప్రదాయానికి సౌరమానం పై ఆధారపడిన పాశ్చాత్య గణనకు మూంలోనే తేడా వుంది.అయినా రెంటినీ కలగలిపిన మిశ్రమ జాతకాలు ఇప్పుడు నడుస్తున్నాయంటే అంతకంటే గత్యంతరం లేదు గనక. అందుకే ఆ రోజున పర్వదిన లాంచనాతో పాటు కానుకలివ్వడం, దస్త్రం మార్చడం వంటి పనులు చేస్తారు.
ఏది ఏమైనా ఉగాదిని ఇంగ్లీషు కాలంలో తెలుగు ఏడాదిగా, సంప్రదాయ సంవత్సరంగానూ పరిగణించడం వాస్తవానికి దగ్గరగా ప్రాణానికి సుఖంగా ఉంటుంది.