Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు.
Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133.
గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్ క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్ అని చెబుతారు. కానీ, అప్పుడప్పుడూ ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘోర సంఘటనే మే 28 (బుధవారం)న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్ లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో…
Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
భారత్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.
Corona Virus: కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ చైనా పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన కారణంగా ‘‘బ్యాట్ ఉమెన్’’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్స్, వూహాన్ యూనివర్సిటీ అండ్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు
HMPV Virus: ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.
HMPV Virus: చైనాని కొత్త వైరస్ ‘‘హ్యుమన్‌మోటాన్యూమో వైరస్( HMPV వైరస్)’’ విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పులు ఇలా కోవిడ్-19, ఫ్లూ వంటి లక్షణాలు కొత్త వైరస్ వల్ల కలుగుతున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Read Also: Delhi…