Off The Record: ఎన్నికలు పూర్తయి, పార్టీకి పవర్ పోయి ఏడాది గడిచినా…. ఆ విషయంలో వైసీపీ అధిష్టానం గందరగోళంలోనే ఉందా? ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోతోందా? పార్టీ అధ్యక్షుడు జగన్ సత్వర నిర్ణయాలు తీసుకుంటారని పేరున్నా… ఆ ఒక్క సబ్జెక్ట్‌లో మాత్రం ఎందుకు జీడిపాకం సీరియల్‌ని తలపిస్తోంది? ఏం చేయాలో అర్ధంకానంత.. ఆ పెద్ద సమస్య ఏంటి? పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి?
Read Also: Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట భారీ మార్పులు.. చేర్పులు చేసి చేతులు కాల్చుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 80 అసెంబ్లీ సీట్లతోపాటు పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా ఇన్‌స్టంట్ కాఫీలాగా… ఇన్‌స్టంట్ మార్పులు చేసేసి చివరికి 11 సీట్లకు పరిమితమైంది. అయితే… ఆ స్థాయి దెబ్బ తగిలాక కూడా పార్టీ అధ్యక్షుడు జగన్ త్వరగానే కోలుకున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ద్వితీయ శ్రేణితో కూడా మీటింగ్‌లు, వరుస సమీక్షలు, మళ్ళీ పాదయాత్ర సంకేతాల్లాంటివి ఇందులో భాగమేనంటున్నారు. అటు సంస్థాగతంగా కూడా పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన మొదలైంది. అత్యంత కీలకమైన పీఏసీలోనూ సమూల మార్పులు తీసుకువచ్చారు జగన్. పార్టీలోని దాదాపు పదవులన్నిటినీ ఫిల్ చేసినా…. నియోజకవర్గాలు మార్చిన చోట ఏం చేయాలా అన్న విషయంలో మీమాంస కొనసాగుతోందట. అందర్నీ తిరిగి పాత సెగ్మెంట్స్‌కు పంపాలా? వద్దా? అన్న దగ్గర ప్రక్రియ ఆగినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.
Read Also: Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో… 80 నియోజకవర్గాల దాకా అభ్యర్థుల్ని మార్చగా.. అందులో అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 11 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇలా మార్చిన వాటిలో కొన్ని చోట్ల నాయకులు ఓటమి తర్వాత పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి చోట్ల మాత్రమే… ఇన్ఛార్జ్‌లను నియమించింది అధిష్టానం. ఇక మిగతా నియోజకవర్గాల్లో మాత్రం… నేతలు తాము అక్కడే ఉండిపోవాలా? లేక మారుస్తారా అన్నది అర్ధంగాక అయోమయంలో ఉన్నారట. ఆ గందరదోళంతో కొందరు పూర్తిగా సైలెంట్ అయిపోగా.. మరికొందరు మాత్రం ఏదో… బండి నడుస్తోంది కదా అన్నట్టు నెట్టుకొస్తున్నారట. ఆయా సెగ్మెంట్స్‌లో కేడర్ యాక్టివ్ అయినా… లీడర్స్ మాత్రం వాళ్ళని నడిపించేందుకు మానసికంగా సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అసలు మార్చిన కొత్త నియోజకవర్గాల్లో కొనసాగేందుకు వాళ్ళు ఇష్టపడటం లేదనేది వైసీపీలో ఓపెన్ టాక్. ఇష్టం లేకున్నా… ఎన్నికల టైంలో పార్టీ నిర్ణయాన్ని కాదనలేక కొత్త చోట్లకు వెళ్ళామని, అక్కడున్న వాళ్ళ సహకారం లేక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నామన్నది ఎక్కువ మంది మనోగతంగా తెలుస్తోంది.
Read Also: Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..
ఆ సహకారలేమి వల్లే చాలా చోట్ల ఫలితాలు తారుమారైనట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… ఎన్నికలు పూర్తయి ఏడాది గడిచినా నియోజకవర్గాలు మారిన నేతల సంగతి ఎటు తేల్చక పోవటంతో… అదే అయోమయం కొనసాగుతోందని అంటున్నారు. అలాగే కొత్త నియోజకవర్గాల మీద ఆసక్తి లేక ప్రస్తుతం పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాల్లో సైతం సరిగా పాల్గొనడం లేదట. హై కమాండ్ చెప్పింది కాబట్టి ఆ రోజున ప్రోగ్రామ్‌లో కనిపించి మమ అని వస్తున్నట్టు సమాచారం. దీనివల్ల నష్టం జరుగుతోందని, పాత నియోజకవర్గాలకు మార్పు విషయంలో పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే… అందరికీ బాగుంటుంది కదా అని కేడర్‌లోనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ స్పష్టత ఉంటేనే…. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటారని, కేడర్‌ని సెట్ చేసుకుంటారని అభిప్రాయ పడుతున్నారు పార్టీ నాయకులు. అలాంటి వాళ్ళంతా.. పార్టీ అధినేత జగన్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఎందుకు పిలిచారు..?
అటు ఈ విషయంలో హై కమాండ్ కూడా కసరత్తు చేస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకోవడంతోపాటు…. మార్పులు చేసిన చోట్ల గెలిచిన నేతలను సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా అక్కడే కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం. కానీ… అక్కడే పీటముడి పడుతోందట. మార్చిన సిట్టింగ్‌లను కొనసాగిస్తే….అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడకు రీప్లేస్ చేయాలన్న విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కాస్త టైం తీసుకుంటే… కొత్త చేరికలు, సామాజిక లెక్కల్లాంటి వాటన్నిటినీ సెట్ చేసుకోవచ్చని అనుకుంటున్నారట. దీంతో ఈ విషయంలో జగన్ లెక్కలేంటి? కొత్త వాళ్ళని, పాత వాళ్ళని ఎలా సెట్ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.