జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల టీవీ రామారావు విచారం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. కార్యకర్తల మనోభవాలు దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంతో రోడ్డెక్కారని స్పష్టం చేశారు. అధిస్థానం తీసుకున్న…
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. కానీ వాతావరణం అనుకూలించక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది సీఎం హెలికాప్టర్. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో…
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత.... నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి నిజంగా నరికేశారు. మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించిన దొమ్మెరు హత్య కేసును కొవ్వూరు పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అధారంగా దుండగులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు వేస్ట్ మెటీరియల్ ను కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తాడు. ప్రభాకరరావు కొవ్వూరు…
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.. వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా.. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. కొవ్వూరులో 34 యాక్ట్ కూడా అమలులో ఉందని.. పోలీసు పికెటింగ్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు..
ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే. రెండోసారి మాత్రం వాళ్ళే దండం పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజికవర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేని వాళ్ళే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ళకి చెక్ పెట్టడానికి ఈసారి మరో సామాజికవర్గం పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కులాల కురుక్షేత్రం? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలే కనిపిస్తుంటాయి. అది ఇది అని…