Off The Record: ఎమ్మెల్సీ కవిత.. ఇక బీఆర్‌ఎస్‌కు పూర్తిగా దూరమైనట్టేనా? ఇక మీదట ప్యాచ్ వర్క్ కూడా కుదిరే అవకాశం లేదా? పార్టీని ఉద్దేశించి ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఇదే విషయం చెబుతున్నాయా? తనకు తానుగా గులాబీ గూటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారా? లేక వేటేసే అవకాశాలు ఉన్నాయా? అసలీ వేట్లు, పాట్ల చర్చ ఇప్పుడెందుకు మొదలైంది?
Read Also: Off The Record: తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ మీటింగ్లో ఏం జరిగింది..?
బీఆర్‌ఎస్‌లో కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా? ఎమ్మెల్సీ కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే… మారుతున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అమెరికా ట్రిప్ నుంచి వచ్చాక కవిత రాజకీయ కదలికల్ని నిశితంగా గమనిస్తున్నవారంతా… అదే అభిప్రాయంతో ఉన్నారట. బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ విషయంలో పార్టీ రియాక్షన్‌ను ఉద్దేశించి ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలతో దూరం బాగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక ప్యాచ్ వర్క్‌లు కూడా పని చేయబోవా అన్న చర్చలు మొదలయ్యాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించుకున్నామన్న సంతోషంలో అధిష్టానం ఉండగానే… మే రెండున పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కవిత. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను అందులో ప్రశ్నించారామె. కానీ… రాసిన 20 రోజుల తర్వాత బయటికి వచ్చింది కవిత లెటర్. ఇక ఆ తర్వాత నేరుగానే స్పందించారామె. ఎమ్మెల్సీ అమెరికా ట్రిప్‌లో ఉన్నప్పుడు లెటర్ లీకవగా… దానిపై రిటర్న్‌లో ఎయిర్‌పోర్ట్‌లోనే రియాక్ట్ అయ్యారామె.
Read Also: Off The Record: కాస్త ఆగండి, వేచి చూద్దామని ఈటల చెప్పారా..?
కేసీఆర్ దేవుడేగానీ.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ… బహిరంగ విమర్శలు చేశారు. ఆ తర్వాత మీడియా సమక్షంలో కేటీఆర్, హరీష్‌రావుని తప్పుపడుతూ మాట్లాడాకు కవిత. ఇంత జరిగినా… పార్టీ ఆమెను చూసీ చూడనట్టే వదిలేసింది.ఇక ఆ అంశంపై బయట ఎక్కడా మరోసారి మాట్లాడలేదు కాబట్టి… మెల్లిగా అంతా సద్దుమణుగుతుందని అనుకున్నారు ఎక్కువ మంది. కానీ, తాజా పరిణామాలు మాత్రం… ఎమ్మెల్సీ పార్టీకి పూర్తిగా దూరమవుతున్నట్టు చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో.. బీఆర్‌ఎస్‌ది ఒక స్టాండ్ అయితే… కవితది మరో స్టాండ్‌లా కనిపిస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా పనైపోయిందని చేతులు దులుపుకోకుండా.. దానికి చట్టబద్ధత కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తుంటే… కవిత మాత్రం ప్రభుత్వాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారన్నది గులాబీ నేతల వాదన. బీసీ రిజర్వేషన్స్ కోసం మేం కోరినట్టుగా ఆర్డినెన్స్ తీసుకోవడం చాలా సంతోషం అంటూ ఏకంగా వేడుకలు కూడా నిర్వహించారు ఎమ్మెల్సీ. అదే సమయంలో ఈ విషయమై సొంత పార్టీ విధానాన్ని కూడా తప్పు పడుతున్నారామె. ప్రభుత్వ తీరుకు నిరసనగా… బీఆర్‌ఎస్ బీసీ లీడర్స్ దిష్టిబొమ్మ దహనం చేస్తే.. వాళ్ళకి పనీపాటా లేదు కాబట్టి అలా చేశారంటూ మాట్లాడారు.
Read Also: Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
అలాగే, తాను న్యాయ నిపుణులను సంప్రదించాకే ఆర్డినెన్స్‌కి మద్దతిచ్చానని చెప్పడం కొసమెరుపు. అంతటితో ఆగితే… అది వేరే సంగతి…. ఇంకో అడుగు ముందుకేసి…. ఈ విషయంలో చివరికి బీఆర్‌ఎస్ కూడా నా దారికి రావాల్సిందేనంటూ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. ఇలా… అత్యంత కీలకమైన అంశంపై పార్టీ స్టాండ్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న కవిత… ఇక బీఆర్‌ఎస్‌కు పూర్తిగా దూరమైనట్టేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. పైగా… ఎప్పటికైనా నా దారిలకి రావాల్సిందేనని చేసిన కామెంట్స్‌తో పెద్దలు మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సామెత- కవిత వివాదంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ ఓపెన్‌గా స్పందించలేదు. స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు చాలామంది నేతలు మల్లన్న వ్యాఖ్యలను ఖండించినా…బీఆర్ఎస్ మాత్రం జస్ట్ ప్రెస్ నోట్‌తో సరిపెట్టింది. అందుకు కూడా కవిత స్పందిస్తూ… ఆ వ్యవహారాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇలా… రకరకాల పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే… ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కు దూరమైనట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు పార్టీ చరిత్ర చూస్తే… ధిక్కార స్వరం వినిపించినప్పుడు కీలకమైన నేతలు మినహా మిగతా వాళ్ళను సస్పెండ్ చేయకుండా… వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయేలా చేసింది. పార్టీలో అలాంటి లీడర్స్ ఉనికిని గుర్తించకపోవడం, వాళ్ళ గురించి అస్సలు మాట్లాడకపోవడం, ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం లాంటి చర్యలతో వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయేలా చేసినట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా అలా జరుగుతుందన్న అంచనాలున్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందోనని పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.