Off The Record: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ మీటింగ్‌లో బనకచర్ల ప్రస్తావన వచ్చిందా? ఆ ప్రాజెక్ట్ గురించిన చర్చ జరిగిందా? అలాంటిదేం లేదని తెలంగాణ సీఎం చెబుతుంటే… ప్రస్తావించామని ఏపీ మినిస్టర్ ఎందుకు అన్నారు? రెండిటిలో ఏది నిజం? అసలా మీటింగ్‌లో ఏం జరిగింది? ఇన్‌సైడ్ మేటర్స్ ఏంటి?
Read Also: Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో… కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే… రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందునా…. బనకచర్ల సెంట్రిక్‌గా…పొలిటికల్ పంచ్‌లు హాట్ హాట్‌గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా? వద్దంటున్న తెలంగాణ పట్టు బిగిస్తుందా? లేక వదలనంటున్న ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా? అన్న చర్చోపచర్చలు. డైరెక్ట్‌గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ఇద్దరు సీఎంల మీటింగ్ అంటే… మామూలుగా ఉండబోదంటూ విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇక మీటింగ్ అయ్యాక… ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. బనకచర్ల తో పాటు అన్ని విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి జలశక్తి శాఖ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
Read Also: Off The Record: కాస్త ఆగండి, వేచి చూద్దామని ఈటల చెప్పారా..?
అయితే, బనకచర్లపై చర్చ జరగలేదని చెప్పారు. అంతేకాదు…. సమావేశానికి సంబంధించిన అధికారిక వివరాలను కేంద్ర జలశక్తి శాఖ కూడా విడుదల చేసింది. ఆ నోట్‌లో సైతం ఎక్కడా… బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరిగినట్టు లేదు. ఇక్కడే తేడా కొడుతోందట పరిశీలకులకు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ చర్చ రాలేదన్నారు. అటు కేంద్ర జలశక్తి శాఖ నోట్ సైతం ఆయన మాటల్ని సమర్ధిస్తున్నట్టుగానే ఉంది. మరి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రమే చర్చ జరిగినట్టు ఎందుకు చెప్పారన్నది బిగ్ క్వశ్చన్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై దాదాపు రెండు నెలల నుంచి చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మీదుగా ఢిల్లీకి చేరింది వ్యవహారం. మేటర్ హై లెవెల్ చర్చలదాకా వెళ్లడంతో అందరి అటెన్షన్ అటువైపు మళ్ళింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌ని కలిసి… ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాంతో ఏపీ సర్కార్ సైతం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడంతోపాటు.. తామ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఆ రాష్ట్ర నీటి అవసరాలకు అడ్డుపడబోమని చెబుతూ.. కేవలం దిగువ రాష్ట్రంగా… సముద్రంలో కలిసే నీళ్ళను మాత్రమే వాడుకోవాలనుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది.
Read Also: Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇంతకీ హత్యా..? పరువు హత్యా..?
అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడసలు సబ్జెక్ట్ అంతా… తాజాగా జరిగిన ఢిల్లీ మీటింగ్‌లో బనకచర్ల గురించి మాట్లాడారా లేదా అన్న అంశం చుట్టూనే తిరుగుతోంది. అది కూడా… ఏపీ మంత్రి, ఒకలాగా, తెలంగాణ సీఎం, సెంట్రల్ నోట్ మరోలాగా ఉండటంతోనే ఈ అనుమానాలు వచ్చాయి. దాంతో… లోపల అసలేం జరిగిందన్న ఆరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే… ఇద్దరి మాటలు నిజమేనన్నది ఇన్‌సైడ్ టాక్. అదెలా సాధ్యం అంటే… అసలు ట్విస్ట్ అక్కడే ఉందని అంటున్నాయి కేంద్ర వర్గాలు. బనకచర్ల అన్న మాట అయితే వచ్చిందిగానీ… దాని మీద ఎలాంటి చర్చ జరగలేదట. ఢిల్లీలో సమాశానికి ముందు తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు అజెండాలతో వెళ్ళారు నాయకులు. తీరా చర్చల సమయానికి మాత్రం.. మొత్తం సీన్ మారిపోయిందట. స్పెషల్ అజెండాల ప్రస్తావన లేకుండానే జరిగిపోయినట్టు తెలుస్తోంది. పోలవరం-బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన క్రమంలో… దాని మీద అసలు చర్చ అవసరంలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నట్టు తెలిసింది.
Read Also: Off The Record: కురుపాం టీడీపీలో పీక్స్కు చేరిన విభేదాలు..
అందుకు తగ్గట్టే దాని మీదేమీ విస్తృత చర్చ జరగలేదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే… బనకచర్ల ప్రస్తావన అయితే వచ్చిందిగానీ… దాని మీద మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరగలేదు. జరిగింది ఇదే కాబట్టి… ఈ విషయంలో ఇక చర్చోపచర్చలకు తావు లేదన్నది కేంద్ర జలశక్తి శాఖ వర్గాల మాట. మీటింగ్‌కు ముందు అయితే… బనకచర్ల విషయంలో ఏదో జరిగిపోతుందని, కేంద్రం ఏ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెగ మాట్లాడేసుకున్నారు అంతా. తీరా… మీటింగ్ జరిగాక మాత్రం…. అంత సీన్ లేదని తేలిపోయింది. హై లెవల్ మీటింగ్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రస్తావన లేకుండానే.. మిగతా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అంగీకరించారు ఇద్దరు ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ నియామకం కీలకమన్న నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు టెలిమెట్రిక్ పరికరాల ఏర్పాటు, శ్రీశైలం డ్యాం మరమ్మతులు, కృష్ణ, గోదావరి బోర్డులు ఎక్కడ ఉండాలన్న అంశాలపై నిర్ణయాలు జరిగాయి. ఇలా… మొత్తంగా చూసుకుంటే… మీటింగ్‌లో బనకచర్ల మీద ఎలాంటి చర్చ జరగలేదన్నది క్లియర్ అంటున్నాయి కేంద్ర జలశక్తి శాఖ వర్గాలు.