వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని డాక్టర్లు సూచించారు.
READ MORE: Toll Charges: హైదరాబాద్-విజయవాడ హైవేపై తగ్గిన టోల్ ధరలు..
సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీనిపై సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని యోచిస్తున్నారు. కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యుల అనుమతితో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకోనున్నారు.
READ MORE: GHMC: రూ.1,910 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు.. నేటితో ముగియనున్న గడువు