Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు.
కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు…
ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయ్యాయి. ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలిసులు. కొడాలి నానిపై అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో వైద్య చికిత్స పేరుతో అమెరికా వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు డీజీపీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు…