ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది. గడువు చివరి రోజును పురస్కరించుకుని, సెలవుదినమైనప్పటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాయిదా పడిన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై 90% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఒటీఎస్ (వన్‌టైమ్ సెటిల్‌మెంట్) ద్వారా రూ.250 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపును వేగవంతం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ, అధికారులు చెల్లింపులకు తుది అవకాశం కల్పిస్తున్నారు.
READ MORE: HCU: టెన్షన్..టెన్షన్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు
కాగా.. జీఎస్టీ, వ్యాట్‌ను ఆన్‌లైన్‌లో అయితే www.apct.gov.in వెబ్‌సైట్‌లో ఈ–పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.