మొసలి నోటికి చిక్కన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. భర్త కాళ్లను నోటీతో పట్టుకుని.. నీటిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన మొసలి పైనే దాడి చేసింది. ధైర్యంగా మొసలిని ఎదుర్కొని క్రూర జంతువు నుంచి తన భర్త ప్రాణాలను కాపాడింది ఓ మహిళ. అవునండీ ఇది నిజం.. రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మండరాయల్ సబ్ డివిజన్ పరిధిలో నివాసం ఉండే బనీసింగ్ మీనా ఓ మేకల కాపరి. అతని భార్య విమలాబాయ్. మంగళవారం.. ఇద్దరు కలిసి మేకలను మేపేందుకు చంబల్ నది తీర ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వాటికి నీళ్లు తాగించేందుకు బనీసింగ్ మీనా.. నది వద్దకు వెళ్లాడు.
Read Also : Google Pay: గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక, ఆ సేవలు ఫ్రీ
దీంతో తనకు కూడా దాహం వేయడంతో నది దగ్గరకు వెళ్లి రెండు దోసిళ్లతో నీళ్లు పట్టుకుని తాగబోయాడు.. అంతే నీటి మాటు నుంచి ఒక్కసారిగా మొసలి అతని మీదకు దూకింది.. వెంటనే బనీసింగ్ పై దాడి చేసింది. అతడి కాలిని పట్టుకుని నోట కరుచుకుని నీటి లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే బిత్తరపోయిన బనీసింగ్ మీనా గట్టిగా కేకలు వేయడంతో.. కాస్త దూరంలో ఉన్న విమలాబాయి. భర్త కేకలు వినింది. పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది.. అతని పరిస్థితిని చూసి బిత్తరపోయింది. వెంటనే తేరుకుని.. నది దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలిపై దాడి చేసింది. దాని తలపై పదే పదే కొట్టడంతో అది కాసేపటికి బనీ సింగ్ మీనా కాలు వదిలేసి నీటిలోకి పారిపోయింది.
Read Also : Karnataka elections: నేటి నుంచి నామినేషన్ల పర్వం.. 12 మంది బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్
అయితే ఇదంతా గమనించిన అక్కడే గొర్రెలు కాస్తున్న కాపరులు వచ్చి బనీసింగ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్ మీనాకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను డాక్టర్లు అందించారు. తన భార్య ప్రాణాలకు తెగించి నన్న కాపాడిందని బనీసింగ్ మీనా పేర్కొన్నాడు. మృత్యువుతో పోరాడుతున్నట్లు తనకి తెలుసని.. ఆ క్షణంలో భర్త ప్రాణాలను కాపాడుకోడమే తన లక్ష్యమని విమలబాయి తెలిపింది. దీంతో భయం వేయలేదని తన భర్తను రక్షించుకునేందు ధైర్యంగా పోరాడి మొసలిపై దాడికి దిగినట్లు విమల వెల్లడించింది.