Crime News: మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా గోవాలోని అసోనోరా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అసోనోరా గ్రామంలోని రిసార్ట్‌లో మహిళా టూరిస్ట్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై గుజరాత్‌కు చెందిన వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన ఆగస్టు 23న జరిగింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా, 47 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు లక్ష్మణ్ షియార్‌గా గుర్తించబడ్డాడు. ఆయన పర్యాటకుడిగా గోవా పర్యటనలో ఉన్నాడు. ఆ మహిళ, నిందితుడు ఇంతకు ముందు విమానంలో కలుసుకున్నారని, ఈ నేపథ్యంలో వారి మధ్య స్నేహం కుదిరిందని డీఎస్పీ జీవ్బా దాల్వి చెప్పారు. ఆ తర్వాత మహిళ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.
Read Also: ITR Refund: లక్షల మంది అందని ఐటీఆర్ రీఫండ్.. ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిందే
ఈ వారం ప్రారంభంలో సదరు మహిళ, నిందితుడు వేర్వేరుగా గోవాను సందర్శించారు. ఆగస్ట్ 23 న అతను ఆమెకు కాల్ చేసి అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలను చూపిస్తానని నమ్మించి, అతను అసోనోరాలోని తాను ఉంటున్న రిసార్టుకు రావాలని కోరాడు. ఆమె ఆ రిసార్టుకు వెళ్లగా.. నిందితుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని అతను ఆమెను బెదిరించాడు. మహిళ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఉత్తర గోవాలోని మపుసా పట్టణానికి సమీపంలోని థివిమ్ గ్రామంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితురాలి వయస్సును పోలీసులు పేర్కొనలేదు. అసోనోరా గ్రామం పనాజీ నుంచి 40 కి.మీ దూరంలో ఉంది.