ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రధాని తల్లి గురించి కాంగ్రెస్ ఏఐ వీడియో చేయడం సిగ్గుచేటని గోవా ఆరోగ్య మంత్రి రాణే అన్నారు. విశ్వజిత్ రాణే, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ రాణే కుమారుడు. ప్రతాప్ సింగ్ గోవాకు ఏడు సార్లు సీఎంగా పనిచేశారు. 50 ఏళ్లు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. 2017లో విశ్వజిత్ రాణే బీజేపీలో చేరారు. ప్రస్తుతం, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. సీనియర్ రాజకీయ నేత, ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ సేవలు అందించిన విజయనగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. దీంతో, ఉత్తరాంధ్రకు రెండో కీలక పదవి దక్కినట్టు అయ్యింది.. ఇప్పటికే ఒడిశా గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు ఉండగా.. ఇప్పుడు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులు అయ్యారు.. అయితే, తన 36 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి…
ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది.
Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి ఒక అమ్మాయిని ఆమె లవర్ చంపేశాడు. దక్షిణ గోవాలో తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో లభించింది. వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ జంట బెంగళూర్ నుంచి గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, వీరి మధ్య వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పోలీసులు మరొకసారి తమ ధైర్య సహసాలను చూపెట్టారు.. వారం రోజులు పాటు డ్రగ్ మాఫియా అడ్డాలో పాగా వేశారు.. డ్రగ్ మాఫియాకు తెలియకుండానే వాళ్ళ గ్యాంగ్ లో చేరిపోయారు.. డ్రగ్ మాఫియా గ్యాంగ్ లోకి చేరిపోయి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.. తెలంగాణ పోలీసులు చేసిన కోవర్ట్ ఆపరేషన్ కి గోవా మొత్తం దద్దరిల్లిపోయింది ..గోవాలో ఏకంగా ఆరు డ్రగ్ మాఫియా గ్యాంగులను పట్టుకున్నారు.. గోవా కేంద్రంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2025-26 సీజన్లో గోవాకు ఆడాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) మంగళవారం యశస్వి లేఖ రాశాడు. యశస్వి నిర్ణయానికి ఎంసీఏ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీ కూడా మంజూరు చేసింది. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన విషయం తెలిసిందే.…
Goa: పర్యాటకానికి కేరాఫ్‌గా ఉన్న గోవాలో ఇటీవల కాలంలో ఆదాయం పడిపోతోంది. టూరిస్టులు గోవాకు రావాలంటే భయపడిపోతున్నారు. టాక్సీల దగ్గర నుంచి ప్రతీ విషయంలో దోపిడీకి గురవుతున్నామనే బాధ టూరిస్టుల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే గోవాలకు అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గుతున్నట్లు డేటా సూచిస్తోంది.