హాట్ హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ.గత కొన్నాళ్లుగా తమన్నా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ‘హ్యాపీడేస్’ సినిమాతో మొదలైన తన సినీ ప్రయాణం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోంది. కొద్దికాలంగా ఈ ముద్దుగుమ్మకు హిట్స్ లేక కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ప్రస్తుతం ఈ భామ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.బిగ్ స్టార్స్ సరసన నటిస్తూ మిల్క్ బ్యూటీ అదరగొడుతోంది. అదిరిపోయే పెర్ఫామెన్స్ అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా బోల్డ్ పెర్ఫార్మన్స్ తో కూడా అదరగొట్టింది తమన్నా.
రీసెంట్ గా చేసిన వెబ్ సిరీస్ లలో బెడ్ సీన్స్ మరియు ముద్దు సీన్లలో నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ భామ రీసెంట్ గా నటించిన ‘జీ కర్దా’ మరియు’లస్ట్ స్టోరీస్ 2′ వంటి సిరీస్ లు ఓటీటీ లో విడుదలై మంచి వ్యూస్ రాబడుతున్నాయి . ఇన్నాళ్లు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న తమన్నా ఒక్కసారిగా హద్దులు చెరిపేయడం తో ప్రేక్షకులు తెగ ఆశ్చర్యపోతున్నారు.సోషల్ మీడియా లో కూడా తమన్నా అందాల విందు చేస్తుంది. టెంప్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ సెగలు రేపుతుంది.అలాగే డిఫరెంట్ అవుట్ ఫిట్లను ధరిస్తూ తన నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా తమన్నా భాటియా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ చారల వంటి సూట్ లో మెరిసింది ఈ భామ.. ఓ హోటల్ రిసెప్షన్ హాల్ లో స్టన్నింగ్ లుక్ తో ఫొటోషూట్ ను చేసింది.టెంప్టింగ్ ఫోజులిచ్చి చూపు తిప్పుకోకుండా చేసింది. తాను షేర్ చేసిన ఫొటోస్ కు ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.