KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్‌లో కాంపిటెన్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వార్నర్ మీడియా, డిస్కవరీ సంస్థలు విలీనమై.. డిస్కవరీగా అవతరించిన తర్వాత ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఆఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఇంత భారీ ఉనికిని కలిగి ఉన్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
Read Also:Supreme Court: అక్కడి వారికి బ్యాడ్ న్యూస్.. గ్రీన్ క్రాకర్లకు సైతం రెడ్ సిగ్నల్
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనేది టెలివిజన్, ఫిల్మ్‌లు, స్ట్రీమింగ్‌లలో బహుళ ఐకానిక్ బ్రాండ్‌లతో ప్రపంచంలోనే ప్రముఖ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అని హైదరాబాద్ కెపాబిలిటీ సెంటర్ (HCC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ అన్నారు. హెచ్‌సిసి ప్రకటించిన నాలుగు నెలల్లోనే గొప్ప రూపాన్ని సంతరించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ చాలా ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 3.23 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఉండేవని, నేడు కోవిడ్ లాంటి మహమ్మారి విజృంభించిన ఉన్నప్పటికీ ఆ సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి, ఎగుమతులు మూడు రెట్లు, నాలుగు రెట్లు పెరిగాయన్నారు.
Read Also:Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..