Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియగా.. మరో రెండు రోజుల పాటు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు.. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది.. టీడీపీ సభ్యులను కొందరని సస్పెండ్ చేస్తూ.. అందరూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నొనాని.. ఒప్పందంపై చంద్రబాబు మొత్తం 13 చోట్ల సంతకాలు చేశారని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు ప్రశ్నిస్తే కాదు.. లేదు అని డైలాగ్‌లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు. ఐఏఎస్‌ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు పేర్ని నాని.
Read Also: MLC Kavitha: రజాకార్ సినిమాను తిరస్కరించండి.. తెలంగాణ ప్రజలకు కవిత పిలుపు..
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యంగా పేర్కొన్నారు పేర్ని నాని.. కేవలం సాంకేతిక కారణాలే కోర్టుల్లో చెబుతున్నారని.. చంద్రబాబు జైలుకెళ్లగానే ఆయన సీట్లో బాలయ్య కూర్చున్నారు.. అసెంబ్లీలో కూడా బాబు చైర్‌లో కూడా బాలయ్య నిలబడ్డారని సెటైర్లు వేశారు. చంద్రబాబు స్కామ్ ఏంటన్నది మనవడికి కూడా అర్ధమవుతోందని విమర్శించారు. సీమెన్స్ రూ. 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందంలో లేదు.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుట్ర అమలు చేశారని ఆరోపించారు. డిజైన్‌టెక్ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేశాడని.. చంద్రబాబు డబ్బును ఎత్తేయడంలో ఎంతో ఆత్రంగా వ్యవరించారు.. స్కిల్ స్కామ్‌లో ఏం జరుగుతుందో చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికీ అసలు విషయం తెలియని సంచలన ఆరోపణలు చేశారు. డొల్ల కంపెనీలకు స్కిల్ నిధులు మళ్లించడం.. అక్కడ నుంచి హవాలా ద్వారా చంద్రబాబు ఖాతాలోకి నిధులు చేరాయని చెప్పుకొచ్చారు.. జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకున్నారు విమర్శించారు.. ఈ దొంగతనానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!