Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆశించిన టికెట్ దక్కక కొందరు.. తమకు గుర్తింపు లేదని మరికొందరు.. తమను పట్టించుకోవడం లేదని ఇంకా కొందరు పార్టీ కండువా మార్చేస్తున్నారు.. ఇక, మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
Read Also: Jeevan Reddy: దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ..
వట్టి పవన్ కుమార్‌తో పాటు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్, వైసీపీ సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ నాయకులు ముత్యాల బాలీజీతో పాటు పలువురు నాయకులు జనసేనలో చేరారు.. అందరికీ జనసేన కండువాలో కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మరోవైపు.. అమలాపురానికి చెందిన సీనియర్ కాపు నాయకులు నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్, నల్లా సంజయ్‌లు కూడా పవన్ సక్షంలో ఈ రోజు జనసేన పార్టీ గూటికి చేరారు.