జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల నియోజవర్గంలోని యువకులతో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. యుద్ధం గెలిచెందుకు యువతకు ఆయుధమవుతా.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి.. ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలు ఎండగట్టాలని యువతకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. యువకులు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే అరవింద్ కు డిపాజిట్ కూడా రాదనీ జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని జీవన్ రెడ్డి తెలిపారు.
Read Also: Kadiyam Srihari: బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటున్నారు..
ఇక, ధర్మపురి అరవింద్ పై గెలిచి, కాంగ్రెస్ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సైతం కేసీఆర్ కు వ్యతిరేకంగా కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చేశానని గుర్తు చేశారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసి శాశ్వత గుర్తింపు కావాలి.. దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ.. పాలనలో ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చిన శ్రీరామ చంద్రమూర్తి ఆదర్శమూర్తి.. స్వార్థం కోసం, రాజకీయాల కోసం దేవుడి పేరు ఉపయోగించుకుంటున్నారు.. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.. యువత ఆ దిశగా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి అని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.