కాంగ్రెస్ సంపదను, మహిళల పుస్తెలు.. ముస్లిం లకు పంచుతామనీ అంటున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హెచ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని మర్చిపోయారని, ముస్లిం ఓట్లు బీజేపీ పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో బీజేపీ ఏం చేశావో చెప్పు అని, ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ప్రధాని మోడీ ఎప్పుడైనా పేదల గురించి మాట్లాడావా అని ఆయన వీహెచ్ ఫైర్ అయ్యారు. రాముడి గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు వీహెచ్.
అంతేకాకుండా..’ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తాం. కుల గణన గురించి ప్రధాని ఎప్పుడైనా మాట్లాడారా .. దేశంలో రాహుల్ గాంధీ కుల గణన Ex-Rey తీస్తాం అంటున్నారు. పదేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు.. రైతులకు గిట్టుబాటు ధర ఎది ఇవ్వలేదు. మోడీ అభివృద్ధి చేయలేదు.. కాబట్టి అయోధ్య రామ మందిరం చూపిస్తున్నారు. నరేంద్ర మోడీ స్థాయికి తగ్గి.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో రాజ్యసభకు వెళ్ళారు.. మన్మోహన్ సింగ్ మీద కూడా దిగజారుడు మాటలు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు. మణిపూర్ లో మారణహోమం జరుగుతుంటే.. వెళ్ళలేదు. తెలంగాణలో బీజేపీ తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.