Khammam: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. ఖమ్మంలోని 20 కాలనీలకు పైగా వరద నీటిలో చిక్కుకోగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు ఖమ్మంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టంపై సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటనలో పాల్గొననున్నారు. ఖమ్మం నగరానికి జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.
Read Also: Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు