Heavy Rains : ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ నిండాయి. రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. మహబూబాబాద్, సూర్యపేట జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలో చెరువులన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు జలాశయం 23 అడుగులు ఉండగా నిండటంతో గేట్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. అదే…
కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రుణమాఫీ చేశామని.. 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంకా మరి కొంతమంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సంతోష సమయంలో వరదల రూపంలో ఉపద్రవం వచ్చి పడిందని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మంలోని బీకే నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ,మహబూబాబాద్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడలో చాలామందిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలిపారు.