Russia-Ukraine war: రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. సాయం కోసం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. రష్యా దాడుల కారణంగా దేశం సర్వనాశనమైందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పునర్నిర్మాణంలో ఉక్రెయిన్ ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరింది. గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ సదస్సులో ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి వోలోడిమిర్ కుజ్యో దేశాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఒక ప్రణాళికను సమర్పించారు. దీని వల్ల ఉక్రెయిన్‌కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. గుజరాత్‌లో ఉక్రెయిన్ అధికారులకు వేదిక ఇవ్వడం భారత విదేశాంగ విధానంలో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
Read Also: Pawan Kalyan: గుంటూరు కారం రిలీజ్ రోజున ట్రెండ్ అవుతున్న అజ్ఞాతవాసి…
అయితే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ ఈ కామెంట్స్ చేసింది. అయితే, భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సాంప్రదాయ సంబంధాలు కొనసాగుతున్నాయి. చమురుతో పాటు, ఆయుధాలు, అణు సాంకేతికతను రష్యా నుంచి భారత్ తీసుకుంటుంది. ఇక, ప్రస్తుతం హైవేలు నిర్మించడం, సముద్రంతో పాటు నది నౌకాశ్రయాలు, రైలు రోడ్లు, నిల్వ, పంపిణీ వంటి మౌలిక సదుపాయాలలో భారతదేశం పెట్టుబడి పెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతుంది.
Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!
ఇక, ఉక్రెయిన్‌లోని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడక్కడ పడి ఉన్న ల్యాండ్‌మైన్‌లను తొలగించడంలో భారతదేశం సహాయం చేయాలని జెలెన్స్కీ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఉక్రెయిన్ డిమాండ్‌పై భారత్ ఇంకా స్పందించలేదు.. కాగా, ఉక్రెయిన్ కోరినప్పటికీ భారత్ అక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని పలువురు నిపుణులు చెప్పుకొచ్చారు.