సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్. వినిపిస్తోంది. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ కథా కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే గుంటూరు కారం సినిమా సాలిడ్ హిట్ అయ్యేది అనే మాట అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజున అజ్ఞాతవాసి సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం విశేషం. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా… త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా అజ్ఞాతవాసి రిలీజ్ అయ్యింది. ఇదే సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ అయిదేళ్ల క్రితం రిలీజైన అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పీడకలలు మిగిలించింది.
ఏ విషయంలో కూడా ఎంగేజింగ్ గా అనిపించని కంటెంట్ తో సినిమా చేసి త్రివిక్రమ్ డిజప్పాయింట్ చేసాడు. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ రైటింగ్ అండ్ మేకింగ్ పైన నెగటివ్ కామెంట్స్ వినిపించడం మొదలయ్యింది. అజ్ఞాతవాసి సినిమా ఎంత డిజప్పాయింట్ చేసినా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం కొత్త రికార్డ్స్ ని సెట్ చేసింది. అజ్ఞాతవాసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం ఓవర్సీస్ ప్రీమియర్స్ విషయంలో అజ్ఞాతవాసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దీన్ని రీచ్ అవ్వడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి కానీ బ్రేక్ చేయలేకపోయాయి. మరి OG సినిమాతో పవన్ కళ్యాణ్ తన రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తాడేమో చూడాలి.