హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
Assault on lift giver: దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? దొంగతనాలకు పాల్పడటమేకాదు వారిపై దాడిచేసి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ వారిపై పోలీసులకు సమచారం అందిస్తారేమో అనే భయంతో వారిప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు దుండగులు. ఈకాలంలో సహాయం చేసినా పాపంగా మారుతుంది. వారికి కావాల్సిందే తీసుకొని దాడిచేసి ప్రాణం తీస్తున్నారు. సహాయం చేసిన…