6.1 Earthquake Hits Turkey: పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బలికెసిర్ ప్రావిన్సులోని సిందిర్గిలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన ఇస్తాంబుల్, ఇజ్మీర్ సహా పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 4.6…
Earthquake: ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1.40 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 136 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 245 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది.
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
Japan Earthquake: ప్రపంచంలో రోజు ఎక్కడో చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీ భూకంపం తర్వాత భూకంప మాట వింటనే జనాలు హడలిపోతున్నారు. శనివారం టర్కీలో 5.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. 66 గంటల వ్యవధిలోనే 37 సార్లు భూప్రకంపనలు వచ్చాయి.
37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత…
Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.
Earthquake Hits Eastern Tajikistan: టర్కీ భూకంపం తరువాత ప్రపంచంలో వరసగా పలు దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న ఇండియా, నేపాల్ లో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తజకిస్తాన్ లో భారీ భూకంపం వచ్చింది.
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాల్లో వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు వారాల క్రితం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1000 పైగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీంతో టర్కీ, సిరియా దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.