సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి
రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేస్తామని.. ఇప్పటికే ప్రకటించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం చిట్ చిట్ నిర్వహించారు. రాహుల్ గాంధీని కలవలేదని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రాకి ధనికా పేద అన్న తేడా లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రధాని మోడీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. కేబినెట్ కూర్పుపై చర్చ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీని కలిశారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలిశారు. ఇక గురువారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పుపై చర్చించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితులు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది. చివరికి బీజేపీనే.. ఆ పీఠాన్ని దక్కించుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్… సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయిష్టంగానే ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది.
దెబ్బ మీద దెబ్బ..! వైసీపీకి మరో షాక్.. అవంతి బాటలో గ్రంధి..
ఏపీలో వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు.. ఇలా చాలా మంది వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు.. ఇక, తాజాగా, మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీని వీడారు.. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.. అందుకే భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ అవంతి రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు.. ఇప్పుడు ఆయన బాటలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వెళ్తున్నారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్ట్..
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న సబిత, సత్యవతి రాథోడ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు మాజీ మంత్రులను అదుపులో తీసుకున్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి లను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
సీఎం కీలక ఆదేశాలు.. వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..
అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.. దీనిపై సీరియస్‌గా స్పందించారు సీఎం చంద్రబాబు. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు.. అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు..
ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్‌కు చెప్పండి.. రాహుల్‌ని కోరిన కేటీఆర్..
లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఒక విషయం కోరుతున్నానని కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులను విడిచి పెట్టమని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని కోరారు. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేస్తారని గుర్తుచేశారు. కానీ రైతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రైతులను ఇలా ఇబ్బందులు పెడితే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి వచ్చింది అని చెప్పారు.
‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…
ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికల కోసం ఉద్దేశించించబడిన ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వారాల తర్వాత తాజాగా ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దశల వారీగా ఏక కాలంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్
మంచు ఫ్యామిలీ వివాదం గతకొద్ది రోజులగా హాట్ టాపిక్ మారింది. ఈ వివాదం పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదు చేయడం జరింగింది. వారి ఫ్యామిలీ ఇష్యూ వలన పబ్లిక్ డిస్ట్రబ్ అవుతున్నప్పుడు కమిషనరేట్ రూల్ ప్రకారం బైండోవర్ చేయచ్చు. మోహన్ బాబు ఇంట్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం. జల్ పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే ముగ్గురికి నోటీసులు ఇచ్చాం. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతల్లో ఇక నుండి ఈ ప్రవైట్ వ్యక్తులు ఉండడానికి విల్లేదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీస్ లకు సూచనలు చేసాం. నేరం చేస్తే ఎవరైనా సమానమే అందుకే సెలబ్రిటీ అయినా సరే బైండోవర్ చేసాం. తెలుగురాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్ మోహన్ బాబు ఫ్యామిలీపై నమోదయింది. మనోజ్ నోటీసులకు స్పందించి తమ ఎదుట హాజరైయ్యాడు. మనోజ్ ని సంవత్సరం పాటు బాండోవర్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలి..
నాలెడ్జ్ సొసైటీ మన లక్ష్యమని.. ఉన్నత విద్య అంశాలు ఏమిటనేది సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలన్నారు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు కూడా అందరూ ముందుకు రావాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక ప్రత్యేక వింగ్ పెట్టుకోవాలన్నారు. మంగళగిరిలో స్కిల్ సెన్సస్ చేశామని.. మంగళగిరి, తాడేపల్లిలకు చాలామంది వలస వస్తారన్నారు. స్కిల్ సెన్సస్ అనేది ప్రస్తుతానికి ఆప్షనల్.. స్కిల్ సెన్సస్ ఆరునెలల్లో అవ్వాల్సినది ఇంకా అవ్వాలన్నారు. స్కిల్ సెన్సస్ ఎప్పటి లోగా పూర్తి చేస్తారనేది తెలియాలన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ డిగ్రీలను గుర్తించాలని.. ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్లోగా ఉన్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌లో లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఏదో లోపం ఉందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో రిజల్ట్ చాలా డల్‌గా ఉందన్నారు. స్కిల్ కోసం కేంద్ర పథకంలో రిజిష్టర్ చేసే వారిని మానిటర్ చేయాలన్నారు. డీఎస్సీ మీటింగ్‌లు తగిన విధంగా జరగలేదని.. కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సచివాలయాల ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంచాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌పైన సీఎం సీరియస్ అయ్యారు.
ఆర్బీఐ నివేదికతో నిజాలు బయటపడ్డాయి.. అబద్దాలు తేలిపోయాయి..
నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని తేలిపోయిందని ఆయన అన్నారు. పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయని, పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందన్నారు హరీష్ రావు. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్టమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్టం అని ప్రచారం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు.