కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ కు సమాచారం అందజేశారు కేసీఆర్.. గులాబీ బాస్ కోరిక ప్రకారం ఈ నెల 11వ తేదీన విచారణకు వచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది.
రాజేంద్ర ప్రసాద్ బూతు వ్యాఖ్యలపై స్పందించిన అలీ
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్‌గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై కమెడియన్ అలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, రాజేంద్ర ప్రసాద్‌ను సమర్థిస్తూ మీడియాను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు.
బాబుగారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఏం నేర్పింది..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజార్చటంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన హయాం, చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్టర్ వేదికగా వివరాలను తెలియజేశారు. చంద్రబాబు గారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఉందని చెప్పుకునే మీకు ఆ అనుభవం ఏం నేర్పింది? అని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో తీసుకున్న అప్పులో మీరు ఇప్పటికే 44 శాతం తీసుకున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ పైనే మా దృష్టి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్ కిటాక్యూషు నగర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎలా నిర్మించబడుతున్నాయో వివరించారు. “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కోసం, కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం,” అని సీఎం పేర్కొన్నారు.
కూకట్‌పల్లిలో డ్రగ్స్.. ఏపీకి చెందిన ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుగుతుంది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్దంకి నుంచి వచ్చి కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు ఈ నిందితులు. కాగా, పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు.. ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఇక, ఈ నిందితుల నుంచి సుమారు 800 గ్రాముల ఎపిడ్రిన్, హెరాయిన్, 5 మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ డ్రగ్ ముఠాలో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావును ఉద్దేశించి స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా?” అని ప్రశ్నించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ఆస్తులు విలువ తగ్గించిన విధానాన్ని “కంచె చేను మేసినట్లు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వాస్తవాలు ప్రశ్నిస్తే.. విమర్శల వేడి ఎందుకు..? కేంద్రంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోదీ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, బీజేపీ నేతలు విమర్శలకు పాల్పడటం దుర్మార్గమని చెప్పారు.
షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేయడంలో లష్కరే తోయిబా పాత్ర..
లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. జేయూడీ నాయకుడు, ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరితో పాటు మరో ఉగ్రవాది ముజమ్మిల్ హష్మీ ఈ వారంలో దీనిపై వ్యాఖ్యానించారు. “1971లో పాకిస్తాన్ ముక్కలైనప్పుడు నాకు నాలుగేళ్లు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండు దేశాల సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో ముంచానని ప్రకటించారు. మే 10న, మేము 1971 ప్రతీకారం తీర్చుకున్నాము” అని కసూరి పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు, ముజమ్మిల్ హష్మీ కూడా ఇదే విధంగా మాట్లాడుతూ.. తాము భారత నాయకత్వాన్ని బంగ్లాదేశ్‌లో గతేడాది ఓడించామని చెప్పాడు.
కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!
కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. జీ-7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడాల కూటమి. అయితే, ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితికి ఆహ్వానాలు అందాయి. దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్త్రేలియా వంటి దేశాలకు కెనడా నుంచి ఆహ్వానాలు అందినట్లు ప్రకటించాయి. అయితే, ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. జూన్ 15-17 వరకు కెనడా వేదికగా జరిగే ఈ సమావేశానికి భారతదేశానికి అధికారిక ఆహ్వానం రాకపోవడం లేదా భారతదేశం హాజరుకావడానికి ఇష్టపడటం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గత ఆరేళ్లలో ప్రధాని జీ-7 సమ్మిట్‌కి వెళ్లకపోవడం ఇదే తొలిసారి.
ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.46 ట్రిలియన్లకు చేరుకున్న రక్షణ ఉత్పత్తి..
భారతదేశ రక్షణరంగ ఉత్పత్తులు 2024-25(FY25)లో ఆల్ టైమ్ రికార్డ్‌కి చేరుకున్నాయి. ఏకంగా 1.46 ట్రిలియన్లకు చేరుకున్నట్లు, ఇది 2024 ఆర్థిక సంవత్సరం(FY24)తో పోలిస్తే రూ. 1.27 ట్రిలియన్ల నుంచి దాదాపుగా 15 శాతం పెరిగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయని వెల్లడించారు. FY24లో రూ.21,083 కోట్ల నుండి ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగాయని ఆయన అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రైవేట్ రంగం షేర్ రూ. 32,000 కోట్లకు పైగా ఉందని అన్నారు. ఇది మొత్తం రక్షణ ఉత్పత్తిలో దాదాపు 22 శాతం. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. FY24లో ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం వాటా 20.8 శాతంగా ఉండేది.