గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక…
మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ.. లోకాయుక్త కోర్టు సీరియస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ ఆక్రమణ ఆరోపణలపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగిన ఈ భూ కబ్జా వ్యవహారం తాజాగా అధికారిక నివేదికలు, ఆధారాలతో మరో కీలక మలుపు తిరిగింది.. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు నిర్ధారితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారుల…
న్యూఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. కత్తి, బీర్ బాటిళ్లతో దాడి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్‌ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్…
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కీలక ఆధారాలు సేకరించిన FSL బృందాలు టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన అగ్నిప్రమాద సంఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు పరిశోధన కొనసాగిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు మంటలలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన వెంటనే రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రయోగాత్మక ఆధారాల కోసం CC కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. దీనివల్ల ప్రమాదానికి ఉన్న కారణాల్ని విశ్లేషించడం కొనసాగుతున్నట్లు డీఆర్ఎం మోహిత్ సోనాకీయా…
గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని…
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..! విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో…
వల్లభనేని వంశీకి షాక్.. మరో కేసు నమోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని…
నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆమోదించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన లేఖను ప్రతినిధి ద్వారా మేయర్ రాజీనామా లేఖను అందజేయగా, అదే రోజు రాత్రి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేయర్ పదవి ఖాళీ కావడంతో ఇంచార్జ్ మేయర్గా రూప్ కుమార్…
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు…
పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కీలక అనుచరుడైన కొమ్మా కోట్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ–2 నిందితుడిగా ఉన్న కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కోట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు. చివరకు అతడు బస చేసిన ప్రదేశంపై ఖచ్చితమైన సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు…