Kolikapudi Srinivasa Rao: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరువూరు పట్టణంలోని 17వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను, మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని అభ్యర్థిస్తున్నారు. తిరువూరును అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అవసరాలను గుర్తించి వారికి న్యాయం చేశారన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమం పూర్తిస్థాయిలో అందాలంటే మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.