MP Kesineni Chinni: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయాలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించిన కొలికపూడి.. తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారు.. ఇక, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన…
ఆ టీడీపీ ఎమ్మెల్యే పాలిట కార్యకర్తలే కత్తుల్లా మారిపోయారా? ఆయనకు వ్యతిరేకంగా చర్యలు మీరు తీసుకుంటారా? లేక మేం చేయాల్సింది చేస్తామని ఏకంగా పార్టీ పెద్దలకే వార్నింగ్ ఇస్తున్నారా? వైసీపీకి సహకరిస్తూ… తమను వేధిస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కేడర్‌లో బస్తీ మే సవాల్ అనిపించుకుంటున్న ఆ లీడర్ ఎవరు? పరిస్థితి ఎందుకు అలా మారిపోయింది? కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా…ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారాయన. వరుసగా మూడు విడతల…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మంగళవారం…
Tiruvuru: తిరువూరు టీడీపీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తీరుతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా అధిష్ఠానం నిర్ణయం ఉంటుందంటున్న పార్టీ వర్గాలు.. గడిచిన 100 రోజుల్లోనే పార్టీకి తలనొప్పిగా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారింది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ సీనియర్ నాయకుడు వంగవీటి రాధ, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడి, ఎరుకోపాడు, చింతలపాడు, గానుగపాడు, కోమ్మిరెడ్డి పల్లి, ముష్టికుంట్ల, అక్కపాలెం, కాకర్ల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి, తోటమూల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా.. జనం ప్రభంజనంతో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో, డాన్సులు వేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను తాను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు మాట…