CM Revanth Reddy : తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని తెచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు (51), విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఉన్నారు. అదేవిధంగా, ఈ ఘటనలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రుయా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
Ram Charan Fans: మృత్యువాత పడ్డ అభిమానుల ఇంటికి చరణ్ ఫ్యాన్స్
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (‘X’) వేదికగా స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట భక్తుల మృతికి కారణమవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సమీక్షిస్తామని తెలిపారు.
Maha kumbh mela: ముస్లింలతో మాకు శత్రుత్వం లేదు.. అయినా, కుంభమేళాలో షాపులు మాత్రం పెట్టుకోనివ్వం..