CS Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా వివిధ ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు తదితర చోట్ల ఏర్పాటు చేసిన 14వేల సీసీటీవీ కెమెరాలు అన్నీ సక్రమంగా పని చేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు.
Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయం సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ కు చెందిన ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెందుర్తి మండలం చింతగట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి యత్నించారు.
Minister BC Janardhan Reddy: రాయలసీమ అభివృద్ధి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ రాయలసీమ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో కర్నూలు పర్యటనకు వచ్చిన జగన్.. కుందూ నదిని వెడల్పు చేస్తానని హామీ ఇచ్చి, ఆ పనులను తన అనుచరులకు కేటాయించుకుని రాజకీయ లబ్ధి పొందారని మంత్రి ఆరోపించారు. అవుకు టన్నెల్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే..…
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని సంచలన కామెంట్లు చేశారు. ప్రైవేటుకు ఇవ్వడమే పెద్ద స్కామ్ అయితే, జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్…
Alluri Agency: అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా ఏళ్ల తరువాత ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు వెళిశాయి. హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి.. ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. "అమరవీరుల హిడ్మాకు జోహార్లు.. ఓ వీరుల నువ్వు కన్న కల దోపిడి లేని స్వేచ్ఛ దేశం నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో చరిత్ర…