గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా మరణించిన ఇద్దరు రామ్ చరణ్ అభిమానుల కుటుంబాలను ఇతర అభిమానులు కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు – అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) – రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ గైగోలుపాడు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటనతో రామ్ చరణ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. చరణ్ ఈ ఘటన తనను ఎంతో బాధించిందని, బాధిత కుటుంబాలతో సమానమైన బాధను తాను అనుభవిస్తున్నానని తెలిపారు.
Pushpa 2: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్
ఈ ఘటనకు స్పందనగా, చరణ్ తక్షణమే ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు. వెంటనే ఆయన తన బృందాన్ని బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పంపారు మంగళవారం అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ తల్లిదండ్రులకు ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన అనంతరం, బుధవారం రామ్ చరణ్ అభిమానులు ఆ కుటుంబాలను కలుసుకున్నారు. వారు మణికంఠ తల్లి అరవపల్లి భవాని, చరణ్ తండ్రి తోకాడ అప్పారావును పరామర్శించారు. వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.