Solar Cycle: సూర్యుడు ప్రస్తుతం తన 25వ ‘సోలార్ సైకిల్’(సౌర చక్రం)లో ఉన్నాడు. 11 ఏళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ప్రస్తుతం సగం కాలం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్టానికి చేరుకుంది.
సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటిని ముందుగానే ఆదిత్య-ఎల్1 గుర్తిస్తుంది. దీని వల్ల శాటిలైట్లను రక్షించుకోవచ్చు.
Aditya-L1 Mission: చంద్రయాన్-3తో చంద్రుడిని అందుకున్న భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధమైంది. ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి చేపడుతున్న ‘ఆదిత్య ఎల్ 1 మిషన్’
ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
Largest Cosmic Explosion: ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడని అతిపెద్ద కాస్మిక్ పేలుడును కనుగొన్నారు. ఈ సంఘటన భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఈ పేలుడు దాదాపుగా 3 ఏళ్ల పాటు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనకు తెలిసిన సూపర్ నోవా విస్ఫోటనం కన్నా పది రెట్లు అధిక ప్రకాశవంతంగా ఉన్నట్లు వెల్లడించారు.
Plasma Waterfall: సూర్యుడు ప్రస్తుత తన 11 ఏళ్ల ‘‘సోలార్ సైకిల్’’ దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సౌర జ్వాలలు, బ్లాక్ స్పాట్స్ వంటివి ఇటీవల కాలంలో ఏర్పడటం గమనించాం. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి ధ్రువాలు మారుతుంటాయి.
Massive 'Hole' Spotted on Sun's Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్…
How And When Will The Sun Die?: సౌరకుటుంబానికి ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, కాంతితోనే ఈ సమస్య సౌరకుటుంబం నిలబడి ఉంటోంది. ముఖ్యంగా భూమిలాంటి గ్రహానికి సూర్యుడు నుంచి వచ్చే శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలతో చూస్తే ఒక్క భూమిపై మాత్రమే జీవజాలం ఉంది. సమస్త జీవజాలం బతకాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి అత్యవసరం. కిరణజన్య సంయోగక్రియ, భూమిని వెచ్చగా ఉంచడానికి సూర్యడు సహాయకారిగా ఉన్నారు. భూమిపై…
A huge explosion on the sun: సూర్యుడిపై ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సౌర విస్పోటనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) వెలువడుతున్నాయి. మంగళవారం సూర్యుడిపై భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సూర్యుడి ఉపరితలం నుంచి 2 లక్షల కిలోమీటర్ మేర సౌరజ్వాల ఎగిసిపడింది. పేలుడు నుంచి వెలువడిని సౌరజ్వాల భూమి వైపుగా రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.