CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల – తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.. రూ.126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్ల మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు.…
Chandrababu: మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యదర్శులు అందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీలోపు ఎందుకు ఖర్చు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పందించారు. హెఓడీలు, సెక్రెటరీలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం అద్భుతమైన ప్రాజెక్టు, ఇది పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదని పేర్కొన్నారు.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. మంత్రులతో సీఎం ప్రత్యేకంగా కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలు, అభివృద్ధి కార్యాచరణపై మంత్రివర్గ సభ్యులతో విస్తృతంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పీపీపీ (PPP– Public Private Partnership) విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయని సీఎం తెలిపారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం…
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. MSME పరిధిలో వచ్చే ఐదేళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం..…
ONGC Gas: రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్ గ్యాస్ లీకేజీ…
Collectors’ Conference: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత ప్రజోపయోగంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు తొలిసారిగా కొత్త విధానాన్ని అవలంభించారు. సాధారణ సమీక్షలకు భిన్నంగా, ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చేశారు.…
Minister Dola Bala Veeranjaneya Swamy: విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విస్తరించిన తొమ్మిది జిల్లాలను కలుపుకుని “విశాఖ ఎకనామిక్ రీజియన్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ఎకనామిక్ రీజియన్ ద్వారా పరిశ్రమలు, ఉపాధి…
CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామంలోని ఆరుగురికి డయేరియా లక్షణాలు కనిపించగా, వారికి వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా, మొత్తం బాధితుల్లో…