ఇండస్ట్రియల్ సమ్మిట్‌లు గత ప్రభుత్వాలూ నిర్వహించాయని, విశాఖలో జరిగిన సమ్మిట్ భారతదేశం చరిత్రలో మారువరానిదన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత పారిశ్రామిక దిగ్గజాలు మొత్తం ఒకే వేదిక మీదికి వచ్చారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. యువత కళ నెరవేరే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘గత సమ్మెట్ లలో అంబానీ ని రప్పించగలిగారా. ఆదానీ, అంబానీ వంటి దిగ్గజాలను విశాఖ తీసుకురాగలిగాం. పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ కి క్యూ కట్టారు.
Also Read : Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
ఏపీ లో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించాం. పెట్టుబడిదారుల్లో నమ్మకం,విశ్వాసం కల్పించారు జగన్. 13 లక్షల 41 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. ఎవరో చెబితే పారిశ్రామిక వేత్తలు సమ్మెట్ కి రారు. స్థిరమైన ప్రభుత్వం,బలమైన నమ్మకం కలగటం వల్లనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. విశాఖ రాజధాని కాబోతోందని సీఎం ఇండస్ట్రియల్ సమ్మెట్ వేదికపై స్పష్టం చేశారు.
Also Read : Harish Rao : కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం
విశాఖకు త్వరలో మకాం మారుస్తానని సీఎం అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఒక్క ఒప్పందం అమలు చేయలేదు. గత ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల్లో భరోసా కల్పించలేకపోయారు. దావోస్ వెళ్లి గుర్రం పళ్ళు తోమారా.. సూటు…బూటు…వేసుకుని హంగామా చేశారు. గత ప్రభుత్వ ఒప్పందాలు మేము రద్దు చేయలేదు. గత ప్రభుత్వ ఒప్పందాల కాల పరిమితి ముగిసిపోవటంతో రద్దయ్యాయి.’ అని ఆయన అన్నారు.