Telangana New CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? అనే ఉత్కంఠకు తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు సాధించిన తర్వాత.. సీఎల్పీ సమావేశం జరిగింది.. ఇక, ఏకవాఖ్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు.. గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిగిపింది.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, థాక్రే.. ఇలా అంతా తెలంగాణ సీఎంపై చర్చించగా.. చివరకు ఢిల్లీలో మీడియతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్.. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగింది.. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్.
Read Also: Cyclone Michaung: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్..
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు ప్రకటించారు కేసీ వేణుగోపాల్.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారన్న ఆయన.. మంత్రులు ఎవరు అనేది తర్వాత చెబుతాం అన్నారు. కాగా, అధిష్టానం ప్రకటన రాకముందే.. సోషల్ మీడియా వేదికగా అధికారులను అప్రమత్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి.. తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని..అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచిస్తూ ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి.