పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్.
సీఎం పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు.. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే.. ఒంటరిగానే కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా.. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు అని డీకే అన్నాడు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి..…
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు…
తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డ కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు ఉండకూడదు.. అంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ అధిష్టానం, రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.. కానీ, మరోసారి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఆయన విమర్శలకు ప్రధాన కారణం అంబేద్కర్ విగ్రహమే.. అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఎత్తుకు పోయారు అని కేసులు పెట్టినా.. ఇప్పటి వరకు చార్జిషీట్ వేయలేదని…
సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్..…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్‌లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు…