తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 60 ఏండ్ల సుధీర్ఘ పోరాట ఫలితంగా జూన్ 02 2014 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయం తెలిసిందే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది. స్వరాష్ట్ర సాధనలో వందలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసింది ఈ మూడు అంశాలే.
Also Read:Spider Web: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. సందేశం ఎవరికంటే..!
అలుపెరుగని పోరాటం అనంతరం కేసీఆర్ నాయకత్వం, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో పదకొండేళ్లు పూర్తి చేసుకుంది. 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలంగాణ తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, రైతులు, కార్మికులు, రాజకీయ నాయకులు స్వరాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమమే ఊపిరిగా పోరాటాలు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పోరాడారు. వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
Also Read:Assam: అస్సాంను ముంచెత్తిన వరదలు.. 132 ఏళ్ల రికార్డ్ బద్ధలు
తొలి తొలిదశ ఉద్యమం
తెలంగాణ తొలి తొలిదశ ఉద్యమం 1969లోనే మెుదలైంది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పెద్దమనుషుల ఒప్పందం అమలుకు నోచుకోకపోవడంతో ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956, ఫిబ్రవరి 20 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1956, నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి కలిగింది. ఒప్పందాన్ని అనుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు. అసలు ఆ పదవినే సృష్టించలేదు. ఇలా అన్ని విధాలుగా ఆంధ్రా పాలకులు అన్యాయం చేయడంతో ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమానికి బీజం పడింది.
Also Read:US: అమెరికాలో ఫైర్ బాంబ్ దాడి.. పలువురికి గాయాలు.. నిందితుడు పాలస్తీనా నినాదాలు
మలిదశ ఉద్యమం
తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో మెుదలై 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముగిసింది. కాసోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డి వంటి వారు ప్రాణాలను త్యాగం చేశారు. వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణ త్యాగాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
Also Read:Shreyas Iyer: భారీ మ్యాచులంటే నాకు చాలా ఇష్టం.. వేలం గురించి ఆలోచించలేదు!
2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్ సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.