IndiGo: ఢిల్లీలో గాలి బీభత్సం.. ఇండిగో విమానానికి కుదుపులు.. ప్రయాణికులు కేకలు
- ఢిల్లీలో గాలి బీభత్సం
- ఇండిగో విమానానికి కుదుపులు
- ప్రయాణికులు కేకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Vikram Sugumaran : ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత..
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ఆదివారం ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. అయితే అదే సమయంలో 6E 6313కి చెందిన ఇండిగో విమానం రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి వస్తోంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. ఇంతలోనే పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. 80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. దీంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు కుదరలేదు. దీంతో మళ్లీ విమానాన్ని పైకి లేపాడు. ఇక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక విమానం కుదుపులకు గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురై కేకలు వేశారు. చివరికి విమానం సాయంత్రం 5.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా ఎట్టకేలకు సాయంత్రం 5.43 గంటలకు ల్యాండ్ అయింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza: గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు.. 31 మంది మృతి
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ మార్పులతో ఢిల్లీ పరిసర ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉంటోంది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆదివారం కూడా నగరంలో భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సోమవారం కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b
— ANI (@ANI) June 1, 2025
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..