Minister Satya Kumar: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆర్ధిక రంగంలో దేశంలోనే మొట్ట దటి పీహెచ్‌డీ సాధించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అలాంటి ఆయనను న్యాయశాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక, రక్షణ రంగాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరం చేశారని ఆరోపించారు. కానీ, అంబేడ్కర్ మేధా సంపద, ప్రజాదరణపై అసూయతో ఆయన్ని అడుగడుగునా అవమానాలకు గురి చేశారు.. 1952లో మొట్ట మొదటి సారి అంబేడ్కర్ పోటి చేస్తే ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకోగా.. నెహ్రూ ఆయన పీఏని పోటీలో పెట్టి ఓడించారని మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేశారు.
Read Also: CM Chandrababu: చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశాను..
ఇక, తనకి తాను భారతరత్న ఇచ్చుకున్న నెహ్రూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు నెహ్రూ, ఇందిరా గాంధీలు నిరాకరించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒక కుటుంబం, ఒకపార్టీ కేవలం తమ ప్రయోజనాలు కాపాడు కోవడానికి అనేకసార్లు రాజ్యంగ సవరణలు చేస్తే.. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ నరేంద్ర మోడీ రాజ్యంగ సవరణ తీసుకు వచ్చారని తెలిపారు. ఇన్ని సంవత్సరాల్లో దేశంలో దళిత నాయకుడిని న్యాయశాఖకు మంత్రి చేసే ఆలోచన కాంగ్రెస్ చేయలేదు అని సత్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.