‘ప్రేమ వివాహం’ మరో యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిపై యువతి సోదరుడు కత్తులతో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న లాలాపేట పోలీసులు.. మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Also Read: Heavy Rains Today: రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు..…
అనకాపల్లి జిల్లాలో పరువు హత్య జరిగిందా? కులమతాలకు అతీతంగా నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారి తీసిందా? తమతో పాటే యువకున్ని తీసుకెళ్లిన తల్లి, బిడ్డ అతన్ని ఏం చేశారు?
చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి చివరికి పరువు హత్యకు దారి తీసిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, సెల్వి దంపతుల కుమారుడు కవిన్‌కుమార్ చెన్నై ఐటీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్‌కుమార్ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోట కేటీసీ నగర్ ప్రాంతంలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తాతకు చికిత్స జరుగుతుండటంతో కవిన్‌కుమార్…
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్…
వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతమవుతున్నాయి. ప్రియురాలు పిలిచిందని ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు.. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పిలిచి కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి గోడదూకితే చితక బాదామని ప్రత్యర్ధులు చెబుతున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నోములలో జరిగింది.చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర గాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇక్కడ చూడండి.. కొరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ యువకుడి పేరు జానయ్య. ఈ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర…
కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది……
చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ…
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
బీహార్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా కలకలం రేగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి(32) 14 ఏళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ 14 ఏళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో నివిస్తున్నారు.
సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు.