ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్థుల్ ఠాకూర్ ఒక్క వికెట్ తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డు ప్లెసిస్ ( 23 ) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అదే విధంగా తొలి మ్యాచ్ లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మాత్రం కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read : Bandi Sanjay Released Live: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్
ICYMI – TWO outstanding deliveries. Two massive wickets.
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match – https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW
— IndianPremierLeague (@IPL) April 6, 2023
ఈ మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓ అద్భుతమైన బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. నరైన విసిరిన బంతికి కోహ్లీ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. ఈ క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన నితీశ్ రాణా.. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చేతికి బంతిని అందించాడు.
Also Read : IPL 2023 : కోహ్లీకి డ్యాన్స్ నేర్పించిన కింగ్ ఖాన్
నితీశ్ రాణా నమ్మకాన్ని సునీల్ నరైన్ వమ్ము చేయలేదు. తను వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. నరైన్ వేసిన ఆఫ్ బ్రేక్ బంతిని కోహ్లీ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న అయ్యి వికెట్లను గిరాటేసింది. అది చూసిన విరాట్ కోహ్లీ బిత్తిరి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా సునీల్ నరైన్ కు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.