ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది. సొంత గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అవమానకర రీతిలో ఏకంగా 72 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఆ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ తో పాటు క్లాసెన్, యాన్సెన్ లు బరిలోకి దిగలేదు. ప్రధాన ప్లేయర్లు లేరు కాబట్టే సన్ రైజర్స్ ఓడిందంటూ అటు ఫ్యాన్స్.. ఇటు మేనేజ్మెంట్ సర్థి చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ప్లేయర్స్ జట్టుతో కలిశారు.
Also Read : Banking Service Charges Increased : షాకింగ్ న్యూస్.. సర్వీస్ చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
దాంతో లక్నోతో జరిగే పోరు సన్ రైజర్స్ కు అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు కెప్టెన్ మార్క్రమ్ కు కొత్త సమస్య తయారైంది. అదే ప్లేయింగ్ ఎలెవన్.. ముఖ్యంగా విదేశీ ప్లేయర్ల విషయంలో ఎవర్నీ ఆడించాలి అనే అంశంపై మార్క్రమ్ తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ రూల్ ప్రకారం.. నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే తుది జట్టులో ఆడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో విదేశీ ప్లేయర్ల కోటాలో హ్యారీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు ఆడారు. అయితే ఇప్పుడు సౌతాఫ్రికా త్రయం జట్టుతో చేరడంతో ఆ నలుగురు విదేశీ ప్లేయర్లు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : IPL 2023: దుమ్మురేపిన శార్థుల్.. స్పిన్ దెబ్బకు కుదేలైన ఆర్సీబీ
కెప్టెన్ హోదాలో మార్క్రమ్ తుది జట్టులో ఉండటం ఖాయం. భారీ మొత్తం చెల్లించిన బ్రూక్ కూడా తుది జట్టులో ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆదిల్ రషీద్ మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. దాంతో స్పిన్నర్ గా అతడు కొనసాగే అవకాశం ఉంది. లక్నో పిచ్ సీమర్లకి అనుకూలిస్తుందనుకుంటే మాత్రం రషీద్ స్థానంలో యాన్సెన్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రషీద్, యాన్సెన్, ఫరూఖీలలో ఇద్దరు బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ గా గ్లెన్ ఫిలిప్స్ ను కొనసాగిస్తారా లేక హెన్రిచ్ క్లాసెన్ ను ఆడిస్తారో చూడాలి.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే క్లాసెన్ కు అవకాశం ఇవ్వడం మంచిది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లో విఫలమైంది. లక్నోతో జరిగే మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది.