టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఎడమ చీలమండలో గాయమైంది. దీంతో బెంగళూరులోని NCAలో చికిత్స తీసుకుని ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. హార్ధిక్ పాండ్యా త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా..
హార్దిక్ పాండ్యా టీమిండియాకు చాలా కీలక ప్లేయర్. ఎందుకంటే అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో జట్టు విజయానికి ఎక్కువగా సహకరిస్తాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో పాండ్యా ఉంటే.. జట్టుకు కొండంత బలంగా ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్ కప్ సమయంలో అతని అవసరం టీమిండియాకు ఎంతో ఉంది. కానీ దురదృష్టవశాత్తు గాయం కావడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ నిన్న జరిగిన ఇంగ్లండ్ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించి విజయాల పరంపర కొనసాగిస్తుంది.
Team India: టీమిండియా అద్భుత బ్యాటింగ్.. పాక్ మాజీ కెప్టెన్ పొగడ్తల వర్షం..
ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా.. BCCI వైద్య బృందం పర్యవేక్షణలో NCAలో ఉన్నాడు. వారు అతని ఫిట్‌నెస్‌పై నిరంతరం నిఘా ఉంచారు. హార్దిక్ ఫిట్‌గా ఉండేలా చూడాలని, అతడిని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా కోరుకుంటోంది. ఓ మీడియా నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఇప్పటికే NCAలో కొన్ని నెట్ సెషన్లలో ప్రాక్టీస్ చేసాడు. BCCI వైద్య బృందం నిరంతర పరిశీలనలో ఉన్నాడని, హార్ధిక్ మంచి ఫిట్ నెస్తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి.. జట్టులోకి తిరిగి వస్తాడా అనేది చెప్పడం కష్టం.. కానీ త్వరలోనే చేరనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే హార్ధిక్ నాకౌట్ మ్యాచ్ల వరకు జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి హార్దిక్ పాండ్యా ఎప్పుడు టీమిండియాలోకి వస్తాడో చూడాలి. నవంబర్ 2న శ్రీలంకతో భారత్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్‌కు కూడా దూరం కాగా.. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా పునరాగమనం చేస్తాడా లేదా అనేది చూడాలి.